ఎక్కడికక్కడే ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం.
–మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, సెప్టెంబర్ 16:
ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి, వారి సమస్యలకు ఎక్కడికక్కడే సత్వర పరిష్కారం చూపించడమే ప్రజాదర్బార్ ప్రధాన లక్ష్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు.
వినతుల స్వీకరణ.. సమస్యలపై ఆరా.
రెడ్డిగూడెంలోని మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పాల్గొని ప్రజల నుంచి నిర్విరామంగా వినతులు స్వీకరించారు. ప్రతి సమస్యను ఓపికగా విని, పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. రుద్రవరంకు చెందిన కొమ్ము జయరాజుకు రూ.49వేల విలువైన ఎల్.ఓ.సిని అందజేశారు. చిరు వ్యాపారికి తోపుడుబండిని అందజేశారు.
అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు.
ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఎక్కడా అలసత్వం, నిర్లక్ష్యం వహించకూడదని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు స్పష్టం చేశారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు.
సమస్యకు నాణ్యమైన పరిష్కారం చూపాలి.
ప్రజా సమస్యలకు కేవలం తాత్కాలిక పరిష్కారం కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపించాలని అధికారులకు సూచించారు. సమస్య పరిష్కారం సాధ్యం కాని పరిస్థితుల్లో అందుకు గల కారణాలను కూడా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు.
సమస్యల మూలాలను గుర్తించాలి.
ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎక్కడికక్కడ బాధ్యతతో పనిచేయాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు అన్నారు. సమస్యల మూలాలను గుర్తించి, పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు.
పలు శాఖల సమస్యలపై ఆర్జీలు.
ప్రజాదర్బార్‌లో పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, రహదారుల అభివృద్ధి తదితర శాఖలకు సంబంధించిన సమస్యలతో పాటు వ్యక్తిగత సమస్యలపై ప్రజలు ఆర్జీలు సమర్పించారు. వినతులను పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఎమ్మెల్యే.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రజాదర్బార్ ఉద్దేశమని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) గారు, తదితరులు పాల్గొన్నారు.



