Sunday, 23 August 2026
  • Home  
  • మనల్ని కరిచిన కుక్కను ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి.
- Featured - ఆంధ్రప్రదేశ్ - హెల్త్ టిప్స్

మనల్ని కరిచిన కుక్కను ఇంటికి వచ్చిన కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి.

మనల్ని కరిచిన కుక్కను ఏమి చేయాలి? చేసేది ఏముంది, కొట్టి చంపి పారేయాలి అన్నది ఎక్కువమంది చెప్పే సమాధానం.ఇది తప్పు. ఆ కుక్కను కొట్టకూడదు. చంపకూడదు. బ్రతికించు కోవాలి. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క పది రోజులు బ్రతికుంటే మనకు దానివలన రేబీస్‌ వ్యాధి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి .ఎంత జాగ్రత్తగా అంటే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి చూసుకున్నంత జాగ్రత్తగా. రేబిస్‌ వ్యాధి మనకు రావాలంటే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ వ్యాధి ఉండి దాని లాలాజలంలో వైరస్‌ ఉండాలి. అలా లాలాజలంలో వైరస్‌ ఉన్న కుక్క వారం లోపల చనిపోవలసిందే. రేబిస్‌ వ్యాధి వచ్చి వారానికి మించి బ్రతికిన జంతువు ఇంతవరకు లేదు. మనల్ని కరిచిన కుక్క వారానికి మించి బతికింది అంటే దానికి రేబీస్‌ లేదు .మరి దానికే లేనప్పుడు అది కరవడం ద్వారా మనకు రేబీస్‌ వచ్చే అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికే మనల్ని కరిచిన కుక్కని పదిరోజులపాటు గమనించుకోవాలి. కుక్క కాటు గాయాన్ని ఏం చేయాలి? వీలైనంత త్వరగా గాయాన్ని నీళ్ళతో కడగాలి.వీలైతే సబ్బుతో కడగడం మంచిది. గాయాన్ని పైపైన కడగడం కాదు లోతుగా కడగాలి. అందుకే కుళాయి కింద గాయ మైన భాగాన్ని ఉంచి గాయం లోపలకు నీరు పోయే విధంగా కడగాలి. అప్పుడే గాయం లోపల ఉన్న రేబిస్‌ కారక వైరస్‌ పూర్తిగా తొలగి పోతుంది. కరచిన వెంటనే కుళాయి అందుబాటులో లేనప్పుడు మగ్గులో నీరు తీసుకుని ఎత్తులో నుంచి గాయం మీద పడేటట్టుగా కడగడం మంచిది. ఇలా కనీసం పది సార్లు కడగాలి.ఇలా వెంటనే గాయాన్ని కడగ గలిగితే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ ఉన్నా దానివలన మనకు వచ్చే అవకాశం దరిదాపుగా లేనట్టే. రేబిస్‌ వ్యాధి సోకి, బ్రతికిన జీవి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వ్యాధికి ఇంతవరకు వైద్యం కనుగొనబడలేదు. ఈ వ్యాధి సోకితే వారంరోజుల్లో చనిపోవలసిందే . ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు 1885 సంవత్సరంలోనే లూయిస్‌ పాశ్చర్‌ అనే మహనీయుడు కుక్క కాటుకు టీకాను కనుగొన్నాడు. అంటే 134 సంవత్సరాల క్రితం ఈ రేబిస్‌ వ్యాధి కి టీకా అనుకొన్నపటికీ వ్యాధి నివారణ మాత్రం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 వేల మంది రేబీస్‌ వ్యాధితో చనిపోతున్నారు ఇందులో 20 వేల మంది మన దేశంలోని వారే చనిపోతున్నారు. ఈ రేబిస్‌ వ్యాధి సంక్రమించేది కుక్క కాటు ద్వారా మాత్రమే కాదు.నక్క ,పిల్లి,కోతి, గబ్బిలం లాంటి జంతువులు కరవడం ద్వారా కూడా సంక్రమించ వచ్ఛు.భారత దేశములో 98% మంది లో రేబీస్‌ వ్యాధికి కారణం కుక్క కాటే. రేబిస్‌ వ్యాక్సిన్‌ ఎలా వేయించుకోవాలి? కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారని గతంలో ఉన్నటువంటి వైద్య సూత్రం. ఇప్పుడు బొడ్డుచుట్టూ వేసే టీకా అనేక దేశాల్లో రద్దు చేయ బడింది. 2004నుంచి మన దేశంలో కూడా రద్దు చేయబడింది. ఇప్పుడు కండలోకి వేసే టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ఐదు విడతలుగా వేయించుకోవాలి. మొదటి డోసు కరిచిన వెంటనే, రెండవ డోసు మూడవరోజు, మూడవ డోసు ఏడవ రోజు, నాలుగవ డోసు 28వ రోజు. (0-3-7-14-28). ఈ 5 విడుదల టీకా ఖర్చు సుమారు 2000 రూపాయలు అవుతుంది.ఈ ఖర్చును పేదలు భరించడం కష్టం. ఖర్చును తగ్గించడానికి పరిశోధనలు జరిపి ప్రస్తుతం చర్మంలోకి వేసే టీకాను కనుగొన్నారు. ఈ టీకాను నాలుగు విడతలుగా వేయించుకోవాలి (0-3-7-28) దీని మొత్తం ఖర్చు సుమారు 400 రూపాయలు.. ఈ టీకాను ఎప్పుడు వేయించుకోవాలి? కరిచిన వెంటనే వీలైనంత త్వరగా టీకా వేయించుకోవడం మంచిది. మనలను కరిచిన కుక్క మంచిదో, పిచ్చిదో మనం గుర్తించడం కష్టం. మొదటి మరియు రెండవ డోసును వేయించుకుని, మనల్ని కరిచిన కుక్కను గమనించడం సాధ్యం కాకపోయినా, కుక్క చనిపోయినా ఏడవ రోజు వేయించుకోవాల్సిన మూడవ డోసును తప్పక వేయించుకోవాలి. కుక్క బ్రతికుంటే మిగిలిన డోసులను వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఈ జాగ్రత్తలు కుక్క కరిచినప్పుడే కాదు, పిల్లి, కోతి, నక్క, గబ్బిలం, గాడిద, గుర్రం ఇలాంటి జంతువులు కరిచినప్పుడు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి.   డాక్టర్‌ యం.వి.రమణయ్య, రామచంద్రారెడ్డి హాస్సిటల్‌, నెల్లూరు రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక

మనల్ని కరిచిన కుక్కను ఏమి చేయాలి?
చేసేది ఏముంది, కొట్టి చంపి పారేయాలి అన్నది ఎక్కువమంది చెప్పే సమాధానం.ఇది తప్పు. ఆ కుక్కను కొట్టకూడదు. చంపకూడదు. బ్రతికించు కోవాలి. ఎందుకంటే మనల్ని కరిచిన కుక్క పది రోజులు బ్రతికుంటే మనకు దానివలన రేబీస్‌ వ్యాధి వచ్చే అవకాశం లేదు. అందుకే ఆ కుక్కను జాగ్రత్తగా చూసుకోవాలి .ఎంత జాగ్రత్తగా అంటే కొత్తగా ఇంటికి వచ్చిన అల్లుణ్ణి చూసుకున్నంత జాగ్రత్తగా.
రేబిస్‌ వ్యాధి మనకు రావాలంటే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ వ్యాధి ఉండి దాని లాలాజలంలో వైరస్‌ ఉండాలి. అలా లాలాజలంలో వైరస్‌ ఉన్న కుక్క వారం లోపల చనిపోవలసిందే. రేబిస్‌ వ్యాధి వచ్చి వారానికి మించి బ్రతికిన జంతువు ఇంతవరకు లేదు. మనల్ని కరిచిన కుక్క వారానికి మించి బతికింది అంటే దానికి రేబీస్‌ లేదు .మరి దానికే లేనప్పుడు అది కరవడం ద్వారా మనకు రేబీస్‌ వచ్చే అవకాశం లేనే లేదు. ఆ విషయాన్ని నిర్ధారించుకోవడానికే మనల్ని కరిచిన కుక్కని పదిరోజులపాటు గమనించుకోవాలి.
కుక్క కాటు గాయాన్ని ఏం చేయాలి?
వీలైనంత త్వరగా గాయాన్ని నీళ్ళతో కడగాలి.వీలైతే సబ్బుతో కడగడం మంచిది. గాయాన్ని పైపైన కడగడం కాదు లోతుగా కడగాలి. అందుకే కుళాయి కింద గాయ మైన భాగాన్ని ఉంచి గాయం లోపలకు నీరు పోయే విధంగా కడగాలి. అప్పుడే గాయం లోపల ఉన్న రేబిస్‌ కారక వైరస్‌ పూర్తిగా తొలగి పోతుంది. కరచిన వెంటనే కుళాయి అందుబాటులో లేనప్పుడు మగ్గులో నీరు తీసుకుని ఎత్తులో నుంచి గాయం మీద పడేటట్టుగా కడగడం మంచిది. ఇలా కనీసం పది సార్లు కడగాలి.ఇలా వెంటనే గాయాన్ని కడగ గలిగితే మనల్ని కరిచిన కుక్కకు రేబిస్‌ ఉన్నా దానివలన మనకు వచ్చే అవకాశం దరిదాపుగా లేనట్టే.
రేబిస్‌ వ్యాధి సోకి, బ్రతికిన జీవి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వ్యాధికి ఇంతవరకు వైద్యం కనుగొనబడలేదు. ఈ వ్యాధి సోకితే వారంరోజుల్లో చనిపోవలసిందే . ఇలాంటి భయంకరమైన వ్యాధి నివారణకు 1885 సంవత్సరంలోనే లూయిస్‌ పాశ్చర్‌ అనే మహనీయుడు కుక్క కాటుకు టీకాను కనుగొన్నాడు. అంటే 134 సంవత్సరాల క్రితం ఈ రేబిస్‌ వ్యాధి కి టీకా అనుకొన్నపటికీ వ్యాధి నివారణ మాత్రం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 60 వేల మంది రేబీస్‌ వ్యాధితో చనిపోతున్నారు ఇందులో 20 వేల మంది మన దేశంలోని వారే చనిపోతున్నారు. ఈ రేబిస్‌ వ్యాధి సంక్రమించేది కుక్క కాటు ద్వారా మాత్రమే కాదు.నక్క ,పిల్లి,కోతి, గబ్బిలం లాంటి జంతువులు కరవడం ద్వారా కూడా సంక్రమించ వచ్ఛు.భారత దేశములో 98% మంది లో రేబీస్‌ వ్యాధికి కారణం కుక్క కాటే.
రేబిస్‌ వ్యాక్సిన్‌ ఎలా వేయించుకోవాలి?
కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు వేస్తారని గతంలో ఉన్నటువంటి వైద్య సూత్రం. ఇప్పుడు బొడ్డుచుట్టూ వేసే టీకా అనేక దేశాల్లో రద్దు చేయ బడింది. 2004నుంచి మన దేశంలో కూడా రద్దు చేయబడింది. ఇప్పుడు కండలోకి వేసే టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ టీకాను ఐదు విడతలుగా వేయించుకోవాలి. మొదటి డోసు కరిచిన వెంటనే, రెండవ డోసు మూడవరోజు, మూడవ డోసు ఏడవ రోజు, నాలుగవ డోసు 28వ రోజు. (0-3-7-14-28). ఈ 5 విడుదల టీకా ఖర్చు సుమారు 2000 రూపాయలు అవుతుంది.ఈ ఖర్చును పేదలు భరించడం కష్టం. ఖర్చును తగ్గించడానికి పరిశోధనలు జరిపి ప్రస్తుతం చర్మంలోకి వేసే టీకాను కనుగొన్నారు. ఈ టీకాను నాలుగు విడతలుగా వేయించుకోవాలి (0-3-7-28) దీని మొత్తం ఖర్చు సుమారు 400 రూపాయలు..
ఈ టీకాను ఎప్పుడు వేయించుకోవాలి?
కరిచిన వెంటనే వీలైనంత త్వరగా టీకా వేయించుకోవడం మంచిది. మనలను కరిచిన కుక్క మంచిదో, పిచ్చిదో మనం గుర్తించడం కష్టం. మొదటి మరియు రెండవ డోసును వేయించుకుని, మనల్ని కరిచిన కుక్కను గమనించడం సాధ్యం కాకపోయినా, కుక్క చనిపోయినా ఏడవ రోజు వేయించుకోవాల్సిన మూడవ డోసును తప్పక వేయించుకోవాలి. కుక్క బ్రతికుంటే మిగిలిన డోసులను వేయించుకోవాల్సిన అవసరం లేదు.
ఈ జాగ్రత్తలు కుక్క కరిచినప్పుడే కాదు, పిల్లి, కోతి, నక్క, గబ్బిలం, గాడిద, గుర్రం ఇలాంటి జంతువులు కరిచినప్పుడు కూడా ఇవే జాగ్రత్తలు తీసుకోవాలి.

 

డాక్టర్‌ యం.వి.రమణయ్య,
రామచంద్రారెడ్డి హాస్సిటల్‌, నెల్లూరు
రాష్ట్ర అధ్యక్షులు, ప్రజారోగ్య వేదిక

3 Comments

  1. homepage

    September 27, 2019

    Feels like a summer morning.
    Mild, edible softness.
    Focus-enhancing fragrance.
    Not powdery or sharp.
    Barely there, but noticeable.
    Pairs with quiet days at home.
    Smells natural and easy.
    Never gets too sweet.
    Peace in perfume form.
    Soft elegance at its best.
    Smells like you’ve got it together.
    Feels warm and safe.
    Blends into your vibe.
    Safe but not boring.
    Barely-there dessert note.
    Like open windows and white sheets.
    Pairs with candles and books.
    Brings me back to myself.
    Supports stronger perfumes.
    Clean and memorable.
    Subtle and wearable.
    Perfect for early mornings.
    Sweetness with space.
    Smells like breathing deep.
    Very aesthetic-friendly.
    Ideal for days when I stay in.
    Elegant humility in a bottle.
    Wears close and soft.
    Pairs with warm thoughts.
    Blends well with rose, jasmine, etc.
    Secure and soft.
    A fragrance I reach for without thinking.
    Elegant in its simplicity.
    Wears well indoors.
    Smells gentle and yummy.
    Tidy and bright.
    A good scent to wear when meeting new people.
    Peaceful and thoughtful.
    Clings quietly.
    Intentional and quiet.
    Clear and hopeful.
    Perfect for cool days.
    Subtle gourmand.
    Perfect for quiet people.
    Coffee and clean air vibe.
    Effortlessly correct.
    Natural but refined.
    Very soothing for night.
    Clean and intentional.
    Blends into any day.
    Softly radiant.
    Smells like clean confidence.
    Polite but firm.
    Optimistic energy.
    Stays close to the body.
    Like dessert air.
    My safe choice.
    Feels like wrapping up in a soft towel.
    No sour drydown.
    Easy to wear around people.
    Quiet and clear aroma.
    Perfect for those who don’t like strong perfumes.

    Minimalist scent styling.
    Soft confidence in a bottle.
    Sweet, but not sugary.
    Soft and atmospheric.
    Pairs with self-reflection.
    Makes dark scents more wearable.
    Minimalist wardrobe essential.
    Quiet sillage magic.

  2. tlover tonet

    September 27, 2019

    Hmm it looks like your site ate my first comment (it was extremely long) so I guess I’ll just sum it up what I submitted and say, I’m thoroughly enjoying your blog. I too am an aspiring blog writer but I’m still new to everything. Do you have any recommendations for beginner blog writers? I’d genuinely appreciate it.

  3. 谷歌SEO公司

    September 27, 2019

    I truly wanted to make a small comment to thank you for all the marvelous ideas you are sharing at this website. My extended internet look up has now been paid with wonderful facts to exchange with my friends. I would state that that many of us site visitors actually are quite fortunate to be in a notable website with very many lovely professionals with very helpful tips. I feel quite happy to have discovered your website page and look forward to really more brilliant moments reading here. Thank you again for all the details.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.