అనపర్తి, సెప్టెంబరు 12 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలకు పిలుపునిస్తూ అనపర్తిలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కుంచెం సత్యనారాయణ (ప్యాచీల షాపు శెట్టి) ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా అధికారులు, కూటమి నాయకులు, గ్రామస్థులకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను వినియోగించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.
కార్యక్రమంలో అనపర్తి టౌన్ కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.





