వేసవి సెలవుల అనంతరం జూన్ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో చిట్వేల్ మండల ఎంఈఓ కార్యాలయంలో వంట ఏజెన్సీలకు కుక్ కమ్ హెల్పర్లపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండల విద్యాశాఖ అధికారులు ఖాజా మొహిద్దీన్, ఈశ్వరయ్య మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణంలో రుచికరమైన, పోషక విలువలతో కూడిన నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. వంటగది, వంట పాత్రలు, వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో రాజీ పడవద్దని తెలిపారు. ఉత్తమ వంట ప్రతిభ కనబరిచిన ఏజెన్సీలకు బహుమతులు ప్రదానం చేయగా, కిచెన్ గార్డెన్, గ్రో బ్యాగ్స్ నిర్వహణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఆర్‌ఎంలు, ప్రత్యేక ఉపాధ్యాయులు, వంట ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.

భోజన నాణ్యతపై ప్రత్యేక దృష్టి