*భోగాపురంపై క్రెడిట్ చోరీకి పాల్పడిందికాక… వై.యస్. జగన్ పై కాలకూట విషం చిమ్ముతారా…!*
*భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు, పవన్, లోకేష్ వి ఉత్తర కుమార ప్రగల్బాలు.*
*ప్రతిపక్షాలపై విరుచుకుపడే ప్రధాని మోదీ,జగన్ ను విమర్శించకపోవడం జగన్ విశ్వసనీయతకు నిదర్శనం.*
*తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి.*
*ఖాజీపేట:*
*భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,మంత్రి నారా లోకేష్ లు క్రెడిట్ చోరీకి పాల్పడింది కాక… భోగాపురం పనులను దాదాపు పూర్తిచేసినప్పటికీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై కాలకూట విషం చిమ్మడంపై వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి, కమలాపురం నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు.ఖాజీపేట మండలం, దుంపలగట్టు లోని ఆయన స్వగృహంలో ఆదివారం ఉదయం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ వైయస్ జగన్ సర్కార్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం భూమిని సేకరించడంతో పాటు,నిర్వాశితులకు పునరావాసం కల్పించడం, అనుమతులు పొందడం, హైకోర్టు,ఎన్జీటీలో దాఖలైన వందకు పైగా కేసులను పరిష్కరించి దాదాపు 80 శాతం పనులను పూర్తిచేస్తే… మిగతా 20 శాతం పనులు పూర్తిచేసిన చంద్రబాబు నాయుడు పబ్లిసిటీలో ఫీక్, పనుల్లో వీక్ గా ఉండి, క్రెడిట్ చోరీకి పాల్పడింది కాక వైయస్ జగన్ పై గ్లోబెల్స్ అమ్మ మొగుడిలా ప్రచారం చేయడం కూటమి ప్రభుత్వ నీచ రాజకీయానికి పరాకాష్ట అని ఆయన ఎద్దేవా చేశారు. ఎయిర్పోర్ట్ కు 15 వేల ఎకరాల భూమి కావాలని చంద్రబాబు నాయుడు అన్న మాటలపై రెడ్ బస్ అనే మాటను అక్కడ నిరసనకు వచ్చిన అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయి మాటలను వైయస్ జగన్ అన్నారంటూ వక్రీకరించి పదేపదే విషం చిమ్మడం చంద్రబాబు,పవన్,లోకేష్ లకే చెల్లిందని ఆయన మండిపడ్డారు.భోగాపురం ఎయిర్పోర్ట్ ను తామే సాధించామని ప్రధాని మోదీ సాక్షిగా ఆ సభలో చంద్రబాబు,పవన్,లోకేష్ లు ఉత్తమకుమార ప్రగల్భాలు పలికారని,పచ్చి అబద్ధాలు నిస్సిగ్గుగా మాట్లాడారని ఆయన ధ్వజమెత్తారు. భోగాపురం ఎయిర్పోర్ట్ తాము సాధించామని గొప్పలకు పోయిన కూటమినేతలు ఎయిర్పోర్ట్ కు వెళ్లే బీచ్ రోడ్డు విస్తీర్ణ పనులను పట్టించుకోలేదని ఇదేనా వారి చిత్తశుద్ధి అంటూ మండిపడ్డారు.ఏ రాష్ట్రానికి వెళ్లి సభలు,సమావేశాలు పెట్టినా ప్రధాని నరేంద్ర మోడీ ఆ రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుక పడతారని కానీ ఇక్కడ వైయస్ జగన్ ను పల్లెత్తు మాట అనకపోవడానికి కారణం వైఎస్ జగన్ విశ్వసనీయతనే అని ఆయన స్పష్టం చేశారు. స్వయాన కూటమిలో ప్రధాన భాగ స్వామి అయినా బిజెపి శాసన పక్ష నేత విష్ణుకుమార్ రాజు విశాఖపట్నం నుండి భోగాపురం వెళ్లేందుకు రెండు గంటలు పడుతుందని, అక్కడ విమానం కోసం గంటన్నర ఎదురు చూడాలని, దానికి బదులు వందేభారత్ రైలు ఎక్కితే నాలుగు గంటల్లో విజయవాడకు వెళ్ల వచ్చునని స్పష్టంగా చెప్పారని దీనిపై దమ్ము, ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని రెడ్యం సవాల్ విసిరారు.*


