పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 16 రాజన్న సిరిసిల్ల జిల్లా
వీర్నపల్లి మండలం వీర్నపల్లి భూముల రిసర్వే ప్రక్రియను రైతులు సహకరించి విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ సూచించారు బుధవారం మండలంలోని రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలు ఆయన మాట్లాడారు భూముల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నమోదు చేయాలని రీ సర్వేను నిర్ణిత లక్ష్యంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కార్యక్రమంలో వీర్నపల్లి గ్రామ సర్పంచ్ మల్లారం జోష్ణ
తాసిల్దార్ ఎంపీడీవో సంబంధిత అధికారులు పాల్గొన్నారు



