*మృతదేహం భుజాలపై.. ఆసుపత్రి వద్ద ఆవేదన*
ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
భద్రాచలం:
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అత్యంత హృదయ విదారకమైన సంఘటన చోటుచేసుకుంది. భద్రాచలం పట్టణానికి చెందిన ఓ వృద్ధుడు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చనిపోతే కనీసం ఉచితంగా ఇవ్వవలసిన అంబులెన్స్ సైతం లేకపోవడం, లేదా ఇవ్వకపోవడంతో చనిపోయిన వ్యక్తిని తీసుకొని భుజాలపై వేసుకొని ఇంటికి వెళ్తున్న కుటుంబ సభ్యులను చూస్తే ఈ సమాజంలో మనం ఎందుకు బ్రతుకుతున్నామా అనేది అర్థం కాని పరిస్థితి. చనిపోయిన వ్యక్తి బాడీని అలా
మోసుకు వెళ్తుంటే ప్రభుత్వ ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు గతంలో ఇతర రాష్ట్రాలలో జరిగినప్పుడు అయ్యో అని బాధపడ్డాము. కానీ ఈరోజు అది మన వరకు వచ్చిందంటే ఈ ప్రభుత్వం, ప్రభుత్వంలోని అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించి కారణమైన ప్రతి ఒక్కరిని సస్పెండ్ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిని ప్రతి రోజు మన జిల్లా కలెక్టర్ తనిఖీ చేస్తూ మెరుగైన వైద్యం అందించండి సకల సదుపాయాలు కల్పించండి అని ఎంత మొత్తుకున్నా సిబ్బంది ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాకపోవడం విచారించదగ్గ విషయం. తక్షణమే వీరందరిపై జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్


