ఆనందపురం, (పున్నమి ప్రతినిధి): జూలై 31
ఆనందపురం మండలం శోంఠ్యం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించిన నూకల రామ్మోహన్ రావు గారి ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం పాఠశాల ఆవరణలో ఘన వీడ్కోలు సభ నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఏ. జోగారావు గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు హాజరై రామ్మోహన్ రావు గారిని ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా గాదె శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, “ఉపాధ్యాయ వృత్తి అనేది ఉద్యోగం మాత్రమే కాదు, భావి తరాలను తీర్చిదిద్దే మహోన్నత బాధ్యత. రామ్మోహన్ రావు గారు వేలాది మంది విద్యార్థుల్లో కళాప్రతిభను వెలికితీసి, విలువలతో కూడిన విద్యను అందించిన ఆదర్శ ఉపాధ్యాయుడు. ఆయన సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయమే” అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రజా సంకల్ప వేదిక విద్యార్థి విభాగం జాతీయ ఉపాధ్యక్షులు, బొద్దపు బంగార్రాజు. పేరెంట్స్ కమిటీ చైర్మన్ లోకి రెడ్డి రాంబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కోరుకొండ వెంకటరావు, గ్రామ పెద్దలు నాయకులు పూర్వ విద్యార్థులు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ రామ్మోహన్ రావు గారి సేవలను ప్రశంసించారు. అనంతరం శాలువా, పుష్పగుచ్ఛాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి భావోద్వేగ వీడ్కోలు పలికారు.
పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


