శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉన్న పవిత్ర భారద్వాజ తీర్థం (లోబావి) లో వందలాది చేపలు సామూహికంగా మృత్యువాత పడటం అటు భక్తులను ఇటు స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ తీర్థంలో భక్తుల సందడి, తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పవిత్రమైన జలాశయంలో ఇలాంటి అపశ్రుతి జరగడంపై ప్రజలు వివిధ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కారణలు కాలుష్యం కొలనులో నీరు మురుగు చేరడం ఇతర వ్యర్థాలు కలవడం వల్ల నీటి నాణ్యత దెబ్బతిని, కాలుష్యం కారణంగా చేపలు చనిపోయి ఉండవచ్చని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
ప్రధాన కారణాలు
ఆక్సిజన్ స్థాయిల తగ్గుదల: నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గడం కూడా చేపల మృతికి ఒక సాధారణ కారణం. ఇది మురుగునీరు చేరడం, అధిక ఉష్ణోగ్రతలు లేదా పాచి విపరీతంగా పెరగడం వల్ల జరగవచ్చునను భావిస్తున్నారు.
పవిత్రతకు భంగం: బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది భక్తులు సంచరించే ఈ తీర్థంలో చేపల కళేబరాలు తేలియాడటం వల్ల పవిత్రతకు భంగం వాటిల్లుతోందని, దుర్వాసనతో భక్తులు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించి, నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, చేపల మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించి, యుద్ధప్రాతిపదికన పుష్యరిణిని శుద్ధి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

భారద్వాజ తీర్థంలో వందలాది చేపల మృతి- ఆందోళనలో భక్తులు
శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అతి సమీపంలో ఉన్న పవిత్ర భారద్వాజ తీర్థం (లోబావి) లో వందలాది చేపలు సామూహికంగా మృత్యువాత పడటం అటు భక్తులను ఇటు స్థానికులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ తీర్థంలో భక్తుల సందడి, తాకిడి అధికంగా ఉంటుంది. ఈ పవిత్రమైన జలాశయంలో ఇలాంటి అపశ్రుతి జరగడంపై ప్రజలు వివిధ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన కారణలు కాలుష్యం కొలనులో నీరు మురుగు చేరడం ఇతర వ్యర్థాలు కలవడం వల్ల నీటి నాణ్యత దెబ్బతిని, కాలుష్యం కారణంగా చేపలు చనిపోయి ఉండవచ్చని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రధాన కారణాలు ఆక్సిజన్ స్థాయిల తగ్గుదల: నీటిలో కరిగిన ఆక్సిజన్ స్థాయిలు ప్రమాదకరంగా తగ్గడం కూడా చేపల మృతికి ఒక సాధారణ కారణం. ఇది మురుగునీరు చేరడం, అధిక ఉష్ణోగ్రతలు లేదా పాచి విపరీతంగా పెరగడం వల్ల జరగవచ్చునను భావిస్తున్నారు. పవిత్రతకు భంగం: బ్రహ్మోత్సవాల సమయంలో లక్షలాది భక్తులు సంచరించే ఈ తీర్థంలో చేపల కళేబరాలు తేలియాడటం వల్ల పవిత్రతకు భంగం వాటిల్లుతోందని, దుర్వాసనతో భక్తులు ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు తక్షణమే స్పందించి, నీటి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపాలని, చేపల మృతికి గల ఖచ్చితమైన కారణాలను నిర్ధారించి, యుద్ధప్రాతిపదికన పుష్యరిణిని శుద్ధి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

