నెల్లూరు జిల్లా: ఏఎస్‌పేట మండలంలో సర్వే నెంబర్లు 144/3B, 144/3C, 145/1A, 145/2లలో జరుగుతున్న లేఅవుట్ అభివృద్ధి పనులకు భారీగా గ్రావెల్ తరలిస్తున్నారనే సమాచారంతో మైన్స్ శాఖ ఆర్ఐ సి.హెచ్. స్వాతి శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తనిఖీ సందర్భంగా సుమారు 35 టిప్పర్ల మేర చదును చేయకుండా నిల్వ ఉంచిన గ్రావెల్‌ను పరిశీలించిన ఆర్ఐ, సంబంధిత అధికారులను వివరణ కోరారు. స్థానిక వీఆర్వో కృష్ణప్రసాద్‌ను వెంట తీసుకుని లేఅవుట్ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.కాగా, ఇదే లేఅవుట్‌కు గతంలో ప్రైవేటు పంట పొలాల నుంచి గ్రావెల్ తరలిస్తుండగా అధికారులు తనిఖీలు నిర్వహించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం నాలుగు రోజుల పాటు గ్రావెల్ తరలింపు నిలిచిపోయినప్పటికీ, మళ్లీ గత మూడు రోజులుగా టిప్పర్లతో పెద్ద ఎత్తున గ్రావెల్ తరలింపు కొనసాగుతుండటంతో మైన్స్ శాఖ ఈ ఆకస్మిక తనిఖీ చేపట్టింది. అలాగే సర్వే నెంబర్లు 144/3B, 144/3C, 145/1A, 145/2లలో జరుగుతున్న లేఅవుట్ అభివృద్ధి పనులకు సంబంధిత శాఖల అనుమతులు ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని కూడా అధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఈ తనిఖీ అనంతరం మైన్స్ శాఖ, రెవెన్యూ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తదితర సంబంధిత శాఖలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనే అంశం ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అనుమతులు లేని లేఅవుట్‌కు గ్రావెల్ తరలింపు.. రంగంలోకి ఆర్ఐ!