*భారత షూటర్, కోచ్ జస్పాల్ రాణా మృతి*
భారత షూటింగ్ దిగ్గజం, ప్రఖ్యాత కోచ్ జస్పాల్ రాణా(49) కన్నుమూశారు. మ్యూనిచ్లో జరిగిన ISSF ప్రపంచ కప్ నుంచి తిరిగి వస్తుండగా విమానంలో అనారోగ్యానికి గురైన ఆయనను ఢిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో అనేక పతకాలు సాధించిన రాణా.. కోచ్గా మారి మను భాకర్, సౌరభ్ చౌదరి వంటి ఎందరో ప్రపంచ స్థాయి షూటర్లను తీర్చిదిద్దారు.


