Friday, 12 June 2026
  • Home  
  • అమలాపురం కిమ్స్ ఆధ్వర్యంలో జూన్ 10 ,11 తేదీల్లో విజయవంతంగా జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సు
- ఆంధ్రప్రదేశ్

అమలాపురం కిమ్స్ ఆధ్వర్యంలో జూన్ 10 ,11 తేదీల్లో విజయవంతంగా జరిగిన అంతర్జాతీయ వైద్య సదస్సు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) అమలాపురం ఆధ్వర్యంలో జూన్ 10, 11 తేదీల్లో “మెడిసిన్ ఎట్ ది క్రాస్రోడ్స్: టెక్నాలజీ, స్కిల్ అండ్ కేరింగ్” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ వైద్య సదస్సు ఘనంగా ముగిసింది. “హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్” అనే ప్రధాన భావనతో జరిగిన ఈ సదస్సులో వైద్యంలో జ్ఞానం, సాంకేతికత, నైపుణ్యాలతో పాటు మానవీయ విలువల ప్రాముఖ్యతను విస్తృతంగా చర్చించారు. భారత్ మరియు అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థల (UC Berkeley, USC Keck School of Medicine తదితర) నుండి ప్రొ. సోలమన్ డార్విన్, డా. ఎమిలీ రోజ్, డా. లతా పాల్ తదితర నిపుణులు హాజరై కృత్రిమ మేధస్సు (AI), టెలీమెడిసిన్, రోబోటిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ (POCUS) మరియు వైద్య నైతికతపై తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా “ది ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్: హ్యూమన్ వర్సెస్ మెషిన్ వర్సెస్ టీమ్” అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. ​ఈ సదస్సులో ఒక కీలక పరిణామంగా, కిమ్స్ వైద్య విద్యార్థులకు ప్రపంచ స్థాయి క్లినికల్ అనుభవాన్ని అందించే దిశగా అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ మరియు ‘కిమ్స్’ మధ్య క్లినికల్ రోటేషన్స్ కోసం ఒక అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో భవిష్యత్ వైద్య విధానాలు, వస్తున్న మార్పులపై వారు అంతర్జాతీయ నిపుణుల నుంచి విలువైన అవగాహన పొందారు అంతర్జాతీయ వైద్య సదస్సులు విజ్ఞాన మార్పిడికి వేదికలుగా నిలుస్తాయని పలువురు ఆకాంక్షించారు. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాయి. సదస్సు ముగింపులో పాల్గొన్న వైద్య నిపుణులను , పరిశోధకులను కిమ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ చైతన్య రాజు ఘనంగా సన్మానించారు. ఈ సదస్సు లో వైద్యరంగంలో కొత్త ఆలోచనలకు పరిశోధనలకు మార్గదర్శకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో వైద్యరంగంలో తాజా పరిణామాలను వైద్యులకు పరిచయం చేయడం నూతన పరిశోధనలను ప్రోత్సహించడం వంటివి చర్చించారు.ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతమైందని కిమ్స్ పౌండర్ అండ్ చైర్మన్ కె.వి.వి సత్యనారాయణ రాజు,(చైతన్య రాజు,) మేనేజింగ్ డైరెక్టర్ కె. రవికిరణ్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. అధునాతన సాంకేతికతకు కరుణ, మానవీయతలను జోడించి సమాజానికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ఈ సదస్సు ఇచ్చిన ముఖ్య సందేశమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలోని కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) అమలాపురం ఆధ్వర్యంలో జూన్ 10, 11 తేదీల్లో “మెడిసిన్ ఎట్ ది క్రాస్రోడ్స్: టెక్నాలజీ, స్కిల్ అండ్ కేరింగ్” అనే అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ వైద్య సదస్సు ఘనంగా ముగిసింది. “హెడ్, హ్యాండ్స్ అండ్ హార్ట్” అనే ప్రధాన భావనతో జరిగిన ఈ సదస్సులో వైద్యంలో జ్ఞానం, సాంకేతికత, నైపుణ్యాలతో పాటు మానవీయ విలువల ప్రాముఖ్యతను విస్తృతంగా చర్చించారు. భారత్ మరియు అమెరికాలోని ప్రముఖ విద్యాసంస్థల (UC Berkeley, USC Keck School of Medicine తదితర) నుండి ప్రొ. సోలమన్ డార్విన్, డా. ఎమిలీ రోజ్, డా. లతా పాల్ తదితర నిపుణులు హాజరై కృత్రిమ మేధస్సు (AI), టెలీమెడిసిన్, రోబోటిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ (POCUS) మరియు వైద్య నైతికతపై తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా “ది ఫ్యూచర్ ఆఫ్ మెడిసిన్: హ్యూమన్ వర్సెస్ మెషిన్ వర్సెస్ టీమ్” అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చ ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.
​ఈ సదస్సులో ఒక కీలక పరిణామంగా, కిమ్స్ వైద్య విద్యార్థులకు ప్రపంచ స్థాయి క్లినికల్ అనుభవాన్ని అందించే దిశగా అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘కెక్ స్కూల్ ఆఫ్ మెడిసిన్’ మరియు ‘కిమ్స్’ మధ్య క్లినికల్ రోటేషన్స్ కోసం ఒక అవగాహనా ఒప్పందం (MoU) కుదుర్చుకోవాలని ప్రతిపాదించారు. వైద్య విద్యార్థులు, అధ్యాపకులు, నర్సింగ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో భవిష్యత్ వైద్య విధానాలు, వస్తున్న మార్పులపై వారు అంతర్జాతీయ నిపుణుల నుంచి విలువైన అవగాహన పొందారు అంతర్జాతీయ వైద్య సదస్సులు విజ్ఞాన మార్పిడికి వేదికలుగా నిలుస్తాయని పలువురు ఆకాంక్షించారు. వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాయి. సదస్సు ముగింపులో పాల్గొన్న వైద్య నిపుణులను , పరిశోధకులను కిమ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ చైతన్య రాజు ఘనంగా సన్మానించారు. ఈ సదస్సు లో వైద్యరంగంలో కొత్త ఆలోచనలకు పరిశోధనలకు మార్గదర్శకంగా నిలిచిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో వైద్యరంగంలో తాజా పరిణామాలను వైద్యులకు పరిచయం చేయడం నూతన పరిశోధనలను ప్రోత్సహించడం వంటివి చర్చించారు.ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా విజయవంతమైందని కిమ్స్ పౌండర్ అండ్ చైర్మన్ కె.వి.వి సత్యనారాయణ రాజు,(చైతన్య రాజు,) మేనేజింగ్ డైరెక్టర్ కె. రవికిరణ్ వర్మ హర్షం వ్యక్తం చేశారు. అధునాతన సాంకేతికతకు కరుణ, మానవీయతలను జోడించి సమాజానికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నదే ఈ సదస్సు ఇచ్చిన ముఖ్య సందేశమని వారు ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.