Sunday, 6 September 2026
  • Home  
  • జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్ల చేతుల మీదుగా , జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కేతా వెంకటరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్ల చేతుల మీదుగా , జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న కేతా వెంకటరెడ్డి

కలిగిరి, పున్నమి ప్రతినిధి, 05-09-2026, కలిగిరి మండలం ,పరికోట మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల, ప్రధానోపాధ్యాయులు విద్యారంగంలో అంకితభావంతో, నిబద్ధతతో విశిష్ట సేవలు అందిస్తున్న శ్రీ కేతా వెంకటరెడ్డి గారికి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. ఈ సందర్భంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ మరియు జిల్లా కలెక్టర్ శ్రీ హిమాన్షు శుక్ల చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ, పాఠశాల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషిస్తున్న కేతా వెంకటరెడ్డి సేవలకు ఈ అవార్డు గుర్తింపుగా నిలిచింది. ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావం, విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ పురస్కారం నిదర్శనమని పలువురు అభినందించారు.జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న సందర్భంగా మిత్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాభిమానులు కేతా వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.