ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తిని కలిగి విద్యార్థుల భవిష్యత్తు కోసం పనిచేయాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున ఫంక్షన్ హాల్‌లో TPTLF ఆధ్వర్యంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకుల సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయులు వృత్తిపట్ల అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో TPTLF రాష్ట్ర కార్యదర్శి విజయ్ కుమార్ పాల్గొని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రైవేటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు.



