దుత్తలూరు
బోటికర్లపాడు,
జూన్ 18: రెడ్లదిన్నె పంచాయతీ పరిధిలోని బోటికర్లపాడు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఉండేలా గురువారెడ్డి విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు.
ప్రతి సంవత్సరం విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మాజి సర్పంచ్ ఉండేలా నాగమ్మ గారు తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ఫాజిల్, ఎంఈఓ-1 వెంగన్న, స్కూల్అధ్యాపకులు మల్లికార్జున గారు పాఠశాల చైర్మన్ కొమ్మి రవి గారు,పంచాయతీ టీడీపీ అధ్యక్షులు సుబ్బారెడ్డి గారు. బూత్ఇంచార్జి తిరుపతి గారు , గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు అభినందించారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారి చదువులకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు.



