పున్నమి న్యూస్ బోగోలు మండలం రిపోర్టర్ గోపాలకృష్ణారెడ్డి.
బోగోలు గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల జరిగిన వార్డు విభజన అసమగ్రంగా ఉందని, దీనివల్ల రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని పలువురు నాయకులు, స్థానికులు పేర్కొన్నారు. ఈ అంశంపై మద్దిబోయిన వీర రఘు అధ్యక్షతన ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బోగోలు గ్రామ పంచాయతీ పరిధిలో వార్డుల విభజన, ఓటర్ల జాబితా సక్రమంగా ఉండాల్సి ఉందని సమావేశంలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జరిగిన వార్డు విభజనలో కొన్ని ప్రాంతాలకు చెందిన ఓటర్లను ఇబ్బందులకు గురిచేసే విధంగా మార్పులు జరిగాయని వారు తెలిపారు.
ముఖ్యంగా ఓటర్లు తమ ఓటు హక్కును సులభంగా వినియోగించుకునే విధంగా వార్డుల విభజన ఉండాల్సి ఉండగా, ప్రస్తుత విభజన కారణంగా ఓటర్లకు గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉందని అన్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఓటర్ల జాబితాలో ఎటువంటి సవరణలు చేయకుండా, మార్పులు లేకుండా అదే జాబితాను కొనసాగించడం సరైన చర్య కాదని వారు అభిప్రాయపడ్డారు.
అసమగ్రంగా ఉన్న ఓటర్ల జాబితాను పునఃపరిశీలించి, నిబంధనల ప్రకారం సరిచేయాలని వారు కోరారు. జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి ఈ విషయంపై వెంటనే స్పందించి, వార్డు విభజన మరియు ఓటర్ల జాబితాలో ఏర్పడిన గందరగోళంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బోగోలు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను గతంలో ఉన్న విధానానికి అనుగుణంగా పరిశీలించి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సక్రమంగా రూపొందించాలని కోరారు. ఓటర్లకు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, సులభంగా వినియోగించుకునే అవకాశం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో బోగోలు మాజీ సర్పంచ్ పర్రి అంకులయ్యా , కళ్యాణ్, ఏకే సుందరరాజ్, దేవరకొండ వరుణ్ తేజ్, గోపిశెట్టి వెంకయ్య, సాల్మన్ రాజ్, తోటపల్లి సాగర్, మిట్ట పిచ్చయ్య, చిన్నప్ప విజయ్ కుమార్ అలియాస్ రెడ్డి, అంతారరాజు, బర్నార్డ్, దాసరి సురేష్, గంగపట్ల పాపయ్య, పాల్ ప్రజాకర్, బంకా రాజన్న , నాయబ్ రసూల్, మల్లి మోహనరావు, కుందుర్తి వేణు, రాజశేఖర్, sk మహబూబ్ బాషా, కుందుర్తి శ్రీనివాసులు, శ్రీధర్, గుత్తి సుధాకర్, సుక్కు మధు, దొడ్ల నాకులరెడ్డి, ప్రసాద్, జోషి, sk కాలేశ, మస్తానవల్లి, జిలానీ, షకీల్, బంక కమల్, గంగపట్ల నరసబాబు, మల్లికార్జున, వెంకటేశ్వర్లు, పులి వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.



