బీసీ కాలనీ స్థలాన్ని కాపాడాలని ఈదరపల్లి గ్రామస్థుల ఆందోళన
నందలూరు, ఆగస్టు 11 (పున్నమి ప్రతినిధి):
నందలూరులోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఈదరపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. బీసీ కాలనీకి కేటాయించిన స్థలాన్ని కొందరు ఆక్రమించారని, ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.
బీసీ కాలనీ స్థలాన్ని కాపాడి, ఆక్రమణను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు తహసీల్దార్ కార్యాలయాన్ని తెరవనివ్వబోమని గ్రామస్థులు స్పష్టం చేశారు.
అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఈదరపల్లి గ్రామస్థులు హెచ్చరించారు.



