తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రానికి చెందిన ఓ ప్రముఖ నేత కుటుంబం త్వరలో బీజేపీలో చేరనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నెల 10న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని Narendra Modi పాల్గొనే బహిరంగ సభ వేదికగా అధికారికంగా చేరిక జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జరిగిన చర్చల్లో ఒక ఎంపీ స్థానం, మూడు ఎమ్మెల్యే సీట్లపై ఒప్పందం కుదిరినట్లు ప్రచారం సాగుతోంది. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని స్థానాల ఖర్చు తానే భరిస్తానని ఆ నేత ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


