బిజినేపల్లి: మండల పరిధిలోని అల్లిపూర్ గ్రామ పంచాయతీలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న పాటు కాలువల పూడికతీత పనులను శనివారం టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ) ప్రవీణ్‌కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పని ప్రదేశాన్ని సందర్శించిన ఆయన, కూలీల మస్టర్లను పేరుపేరునా చదివి వినిపించారు. అనంతరం మాట్లాడుతూ.. కూలీలు కొలతల ప్రకారం పనులు చేసి పూర్తి వేతనం పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్‌తో పాటు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.



