బిక్కవోలు, ఆగస్టు 16 (పున్నమి ప్రతినిధి): వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా బిక్కవోలు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో నిర్వహించిన ‘పందిరి రాట మంచి’ కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మహాలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. వారితో పాటు అనపర్తి నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పాల్గొని ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ కమిటీ సభ్యులు, అనపర్తి నియోజకవర్గ కూటమి నాయకులు, బిక్కవోలు మండల, గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



