తూర్పుగోదావరి జిల్లా పున్నమి ప్రతినిధి
✍️ సిరిసిపల్లి చిన్న రమేష్ బాబు
న్యూస్ రిపోర్టర్
బిక్కవోలు, 23 మే (పున్నమి ప్రతినిధి): ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి గారికి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు, మహిళలు.
63.50 లక్షల రూపాయలతో నిర్మించిన బిక్కవోలు మెయిన్ రోడ్ నుండి స్మశాన వాటికకు వెళ్ళు సిసి రోడ్ నిర్మాణంను ప్రారంభించిన ఎంపీ దగ్గుబాటి, ఎమ్మెల్యే నల్లమిల్లి.
దాతల సహకారంతో 47 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన స్మశాన వాటిక, చెత్తను శుభ్రం చేయుటకు, స్నాన ఘట్టంను ప్రారంభించిన ఎంపీ దగ్గుబాటి, ఎమ్మెల్యే నల్లమిల్లి.
స్మశాన వాటికను అభివృద్ధి చేయడంలో సహకరించిన దాతలకు, శ్రమదానం చేసిన ట్రాక్టర్ ఓనర్స్ ను సత్కరించి, అభినందించిన ఎంపీ దగ్గుబాటి, ఎమ్మెల్యే నల్లమిల్లి.
తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు మండలం, బిక్కవోలులో కోటి 10 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన బిజెపి జాతీయ నాయకులు & రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి & అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం కూటమి నాయకులు, బిక్కవోలు మండలం కూటమి నాయకులు, బిక్కవోలు గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



