Tuesday, 16 June 2026
  • Home  
  • బాల్య వివాహాలు, బాలకార్మిక నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం- ప్రగతి సంస్థ
- తిరుపతి

బాల్య వివాహాలు, బాలకార్మిక నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం- ప్రగతి సంస్థ

ఏర్పేడు, జూన్ 15, (పున్నమి న్యూస్) : బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఏర్పేడు మండల కేంద్రంలో ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో, క్రై (CRY) బెంగళూరు సహకారంతో సోమవారం నిర్వహించిన మల్టీ స్టేక్ హోల్డర్ కన్వర్జెన్సీ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రగతి సంస్థ డైరెక్టర్ కె.వి. రమణ మాట్లాడుతూ….శ్రీకాళహస్తి శివరాత్రి సామూహిక వివాహాల్లో బాల్య వివాహాల నివారణకు 2009 నుంచి సంస్థ కృషి చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ శాఖల సహకారంతో గత మూడేళ్లుగా మండలంలో బాల్య వివాహాలు నమోదు కాకపోవడం సంతోషకరమన్నారు. వలసలే బాలకార్మిక వ్యవస్థకు ప్రధాన కారణమని తహసీల్దార్ రాజశేఖర్ పేర్కొనగా, నిర్మూలనకు సమిష్టి చర్యలు అవసరమని సూచించారు. ఎంపీడీవో సౌభాగ్య, మండల విద్యాశాఖాధికారి దయాకర్, లేబర్ ఆఫీసర్ శ్రీమన్నారాయణ, వైద్యాధికారి డాక్టర్ లావణ్య, ఎస్‌ఐ శ్రీకాంత్ రెడ్డి బాలల హక్కుల పరిరక్షణ, విద్యాభివృద్ధి, బాల్య వివాహాల నివారణపై తమ శాఖల చర్యలను వివరించారు. ఇటీవల టీనేజ్ గర్భధారణ కేసులు పెరుగుతున్నాయని వైద్యాధికారి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రగతి సంస్థ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కె. నారాయణ మాట్లాడుతూ, గత ఏడాదిలో 50 మంది బాలకార్మికులను, 240 మంది బడి మానేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్పించడంతో పాటు 75 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు తెలిపారు. అనంతరం బాలల హక్కుల పరిరక్షణకు ప్రతిజ్ఞ చేయించి సమావేశాన్ని ముగించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.