Monday, 10 August 2026
  • Home  
  • బంగారు తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామి అభయం
- తిరుపతి

బంగారు తిరుచ్చిపై శ్రీకృష్ణస్వామి అభయం

తిరుచానూరు, ఆగస్టు 8 పున్నమి ప్రతినిధి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణస్వామివారు శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. శ్రీకృష్ణస్వామి వారి జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అహంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారిని విశేషముగా అలంకరించి, ఉంజల్ సేవా నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చి పై కొలువు దీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్రాయులు, సురేష్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుచానూరు, ఆగస్టు 8 పున్నమి ప్రతినిధి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి అనుబంధ ఆలయంలో కొలువైన శ్రీకృష్ణస్వామివారు శనివారం సాయంత్రం బంగారు తిరుచ్చి పై ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. శ్రీకృష్ణస్వామి వారి జన్మనక్షత్రమైన రోహిణి నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అహంకారాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోహిణి నక్షత్రం సందర్భంగా స్వామివారిని వేకువజామున సుప్రభాతంతో మేలుకొలిపి, నిత్య కైంకర్యాలు నిర్వహించారు. సాయంత్రం రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారిని విశేషముగా అలంకరించి, ఉంజల్ సేవా నిర్వహించారు. అనంతరం బంగారు తిరుచ్చి పై కొలువు దీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఏవీఎస్ఓ శ్రీహరిరావు, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్రాయులు, సురేష్, ఇన్స్పెక్టర్లు లక్ష్మీకాంత్, మునస్వామి, చలపతి ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.