తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఎదుట హాజరయ్యారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు రాజకీయ నాయకుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. మాజీ ఇంటెలిజెన్స్ విభాగ అధికారుల పాత్రపై కూడా విచారణ కొనసాగుతోంది. ఎన్నికల ముందు రాజకీయ నాయకుల ఫోన్లను నిఘాలో పెట్టారనే ఆరోపణలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్యే విచారణకు హాజరు