Monday, 17 August 2026
  • Home  
  • ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను పరిశీలించిన ఎంఈఓ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను పరిశీలించిన ఎంఈఓ

ఉదయగిరి ఎన్బీఓ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం నిర్వహిస్తున్న ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఎంఈఓ-1 టి. వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నోట్బుక్స్, వర్క్‌బుక్స్‌ను పరిశీలించడంతో పాటు జాదూ పితారా కిట్ల వినియోగంపై ఆరా తీశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, అభ్యసన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా విద్యార్థులు జవాబులు రాసేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. పరీక్షలు పూర్తయిన వెంటనే విద్యార్థుల మార్కులను ఆన్‌లైన్‌లో త్వరితగతిన నమోదు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.