ట్రాక్టర్ డ్రైవర్లకు ఎస్సై మల్లికార్జున్ అవగాహన*
*తిరుపతి జిల్లా వరదయ్యపాలెం*
👉ప్రమాదాలతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండేలా ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలతో పాటు అవసరమైన వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలని ఎస్సై మల్లికార్జున్ పిలుపునిచ్చారు..
👉వరదయ్యపాలెంలో ప్రమాదాల నివారణకు ట్రాక్టరు డ్రైవర్లు పాటించాల్సిన నిబంధనలపై ఎస్సై మల్లికార్జున్ ట్రాకర్ డ్రైవర్లకు చైతన్యం కల్పించేలా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు
👉ఈ సందర్భంగా రాత్రివేళల్లో వాహనాల్ని గుర్తించేలా ప్రతి ట్రాక్టర్ కు ఇరువైపులా రేడియం స్టిక్కర్లను వేయించాలని కోరారు
👉రేడియం స్టిక్కర్లు వేసుకోని డ్రైవర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై మల్లికార్జున్ హెచ్చరించారు.


