విజయనగరం జిల్లా బ్యూరో/ రమణ,ఆగస్టు 13. పున్నమి ప్రతినిధి
జామి మండలం జాగరం గ్రామంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొని గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు. తల్లికి వందనం, మహిళా శక్తి, అన్నదాత సుఖీభవ, దీపం-2, ఎన్‌టీఆర్ భరోసా, సూపర్ సిక్స్ వంటి పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.



