శ్రీ కాళహస్తి, జూన్ 27, (పున్నమి న్యూస్) : నేడు నిర్వహించనున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని శ్రీరామ్‌నగర్ కాలనీ యూపీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలు విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలోపు వయస్సున్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. గతంలో ఎన్నిసార్లు పోలియో చుక్కలు వేసినా, పిల్లలను పోలియో బారిన పడకుండా పూర్తిస్థాయిలో రక్షించేందుకు ఈ విడతలో కూడా చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి తల్లిదండ్రుల సహకారం కీలకమని పేర్కొన్న ఆయన, కార్యక్రమం కోసం వైద్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో అన్ని పోలియో కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. బూత్‌లకు రాలేని చిన్నారులకు అవసరమైన ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా ఈ అవకాశాన్ని కోల్పోకుండా సమీప పోలియో కేంద్రానికి తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, అలాగే ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలందరూ సహకరించాలని డాక్టర్ బాలు కోరారు.

పల్స్ పోలియోను విజయవంతం చేయండి-డాక్టర్ బాలు