శ్రీ కాళహస్తి, జులై 03 : (పున్నమి న్యూస్) : ప్రపంచ మెకానిక్ డే సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణంలో శుక్రవారం టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించి మెకానిక్‌లకు ప్రపంచ మెకానిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజానికి నిరంతరం సేవలందిస్తున్న టూ వీలర్ మెకానిక్‌ల కృషి అభినందనీయమని కొనియాడారు. మెకానిక్‌లు ఐక్యంగా ఉంటూ పరస్పర సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, తమ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ద్విచక్ర వాహన ర్యాలీలో మెకానిక్‌లు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో టూ వీలర్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షుడు అంజద్‌తో పాటు మిన్నల్ రవి, ఉమేష్ రావు మోరే, కంటా రమేష్, కాసారం రమేష్, వజ్రం కిషోర్, జయ, మోహన్, శంకర్, అయ్యప్ప, బాబు, మహేశ్, కిషోర్, ఉమాపతి, గోపి తదితర యూనియన్ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రపంచ మెకానిక్ డే.. శ్రీకాళహస్తిలో ఘనంగా ద్విచక్ర వాహన ర్యాలీ