శ్రీ కాళహస్తి, జులై 28, (పున్నమి న్యూస్): ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు దండి నరేంద్ర నేతృత్వంలో ఆ పార్టీ ప్రతినిధులు మంగళవారం నాడు ఆర్డీవో భానుప్రకాష్ రెడ్డిని కలిసి పలు కీలక సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలను ఆర్డీవో దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు దండి నరేంద్ర వెల్లడించారు. ముఖ్యంగా రేణిగుంట మండలం గాజులమండ్యం పంచాయతీ హరిజనవాడలోని 170కి పైగా కుటుంబాల నివాస భూముల రిజిస్ట్రేషన్ అంశంపై చర్చించగా, ప్రభుత్వం జారీ చేసిన పొజెషన్ సర్టిఫికేట్ ఆధారంగా వారు నిరభ్యంతరంగా నివాసం కొనసాగించవచ్చని ఆర్డీవో స్పష్టం చేశారు. అలాగే రాబోయే ఆరు నెలల్లో గృహ నిర్మాణం, మరమ్మతుల కోసం లబ్ధిదారులకు రుణ సౌకర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. మరోవైపు రేణిగుంట-కడప జాతీయ రహదారి విస్తరణలో బాలపల్లి, మామండూరు పరిధిలో ఇళ్లు కోల్పోతున్న దాదాపు 15 కుటుంబాలకు భవనాలతో పాటు భూమి, చెట్లు, బోర్‌వెల్లు తదితర అన్ని ఆస్తులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తి పరిహారం అందజేస్తామని, రాబోయే మూడు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని ఆర్డీవో భరోసా ఇచ్చారు. తీవ్రంగా కృషి చేసిన జనసేన కార్యకర్త గోవర్ధన్ నివాస స్థలానికి సంబంధించిన పొజెషన్ లెటర్ ఆలస్యంపై స్పందిస్తూ, సంబంధిత తహసీల్దార్‌తో మాట్లాడి ప్రాధాన్య క్రమంలో త్వరలోనే అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి, తగిన పరిష్కార మార్గాలు చూపిన ఆర్డీవోకు జనసేన నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట మండల అధ్యక్షుడు చిన్నతోటి నాగరాజు, గిరిజన జనసేన నాయకులు చందమామల కోటయ్య, గోవర్ధన్, బాబు, రవి, లక్ష్మణ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం-ఆర్డీవోకి జనసేన వినతిపత్రం