Monday, 14 September 2026
  • Home  
  • ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట
- BHADRADRI

ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట

బద్రాద్రి కొత్తగూడెం,చుంచుపల్లి మండలం, ఆగస్టు 11, (పున్నమి ప్రతినిధి) కుంటుపడిన కొత్తగూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సీపీఐనేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న 5వ రోజు ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఆటా పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 76ను అమలు చేయకుండా బుట్టదాఖలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని, ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడుతామని సాబీర్ పాషా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.

బద్రాద్రి కొత్తగూడెం,చుంచుపల్లి మండలం, ఆగస్టు 11, (పున్నమి ప్రతినిధి)
కుంటుపడిన కొత్తగూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సీపీఐనేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న 5వ రోజు ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఆటా పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 76ను అమలు చేయకుండా బుట్టదాఖలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని, ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడుతామని సాబీర్ పాషా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.