Friday, 14 August 2026

Tag: Kothagudem

BHADRADRI

కొత్తగూడెంలో ఈ -చలాన్ ల మోత

భద్రాద్రికొత్తగూడెం జిల్లా :ఆగష్టు 13:(పున్నమి ప్రతినిధి ):: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సిటీ లో ట్రాఫిక్ పోలీస్ లు పాత bike ల మీద కూడా కొత్త ఇ చలాన్ ల మోత మొగిస్తున్నారు.రోజు కూలి పనులకి వెళ్లే పేదలకే పాత బైక్ లే ఆధారం, కానీ ఇప్పుడు అదే బైక్ మీద ఇ చలాన్ లు వేయటంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోకల్ లో తిరిగే బైక్ లని సందుల్లో కూడా చెక్ పోస్ట్ లు పెట్టి హెల్మెట్ లేదు,ఇన్సూరెన్స్ ఎక్సపైర్డ్ అయ్యింది,పైక్ లేదు అంటూ ఒక్కొక్కరికి 1000నుండి 3000వరకు చలాన్ లు వేస్తున్నారు. 10నుండి 15సంవత్సరాల బైక్ లకి డాకుమెంట్స్ రెన్యువల్ చేయించుకోవటం చాలా ఇబ్బందిగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని వేలకి వేలు చలన్లు వేయటం సరికాదని భాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.రూల్స్ పాటించటం మంచిదే కానీ పేదలకి వెసులుబాటు ఇవ్వాలని కోరుతున్నారు.

BHADRADRI

ప్రజా సమస్యలపై సీపీఐ పోరుబాట

బద్రాద్రి కొత్తగూడెం,చుంచుపల్లి మండలం, ఆగస్టు 11, (పున్నమి ప్రతినిధి) కుంటుపడిన కొత్తగూడెం అభివృద్ధిని గాడిలో పెట్టింది సీపీఐనేనని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా అన్నారు. పట్టణంలో నిర్వహిస్తున్న 5వ రోజు ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఆటా పాటలతో ప్రజలను చైతన్యపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు, ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణకు సంబంధించిన జీవో 76ను అమలు చేయకుండా బుట్టదాఖలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు, సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని, ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల తరఫున పోరాడుతామని సాబీర్ పాషా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ పోరాటాలు కొనసాగిస్తుందని తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.