Wednesday, 17 June 2026
  • Home  
  • ప్రకృతి వ్యవసాయమే రైతు భవిష్యత్‌కు భరోసా – యలమంచిలిలో అవగాహన సదస్సు..!
- అనకాపల్లి

ప్రకృతి వ్యవసాయమే రైతు భవిష్యత్‌కు భరోసా – యలమంచిలిలో అవగాహన సదస్సు..!

యలమంచిలి, పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్: యలమంచిలి మండల పరిధిలో APCNF ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ చి. లచ్చన్న ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ, వెలుగు, ఉపాధి హామీ పథకం శాఖల సిబ్బంది, మండల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేషగిరి రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు అన్నం బాబ్జి, లాలం సోమునాయుడు, కొలగాని భాస్కర్ పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను వివరించారు. యలమంచిలి మండలంలోని ప్రతి గ్రామ రైతుకు ప్రకృతి వ్యవసాయాన్ని చేరవేసి, రసాయన రహిత సాగు విధానాల వైపు ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ చి. లచ్చన్న మాట్లాడుతూ PMDS వినియోగం, కషాయ ద్రావణాల తయారీ, బయో రిసోర్స్ సెంటర్ల సేవలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలను వివరించారు. భూమి సారాన్ని పెంచుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని పేర్కొంటూ రైతులందరూ ఈ విధానాన్ని విస్తృతంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో, APCNF సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

యలమంచిలి, పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్:
యలమంచిలి మండల పరిధిలో APCNF ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ చి. లచ్చన్న ఆధ్వర్యంలో ఎంపీడీవో కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో వ్యవసాయ, ప్రకృతి వ్యవసాయ, వెలుగు, ఉపాధి హామీ పథకం శాఖల సిబ్బంది, మండల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు రాజాన సూర్య చంద్ర శేషగిరి రావు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు అన్నం బాబ్జి, లాలం సోమునాయుడు, కొలగాని భాస్కర్ పాల్గొని రైతులకు ప్రకృతి వ్యవసాయం ప్రాధాన్యతను వివరించారు. యలమంచిలి మండలంలోని ప్రతి గ్రామ రైతుకు ప్రకృతి వ్యవసాయాన్ని చేరవేసి, రసాయన రహిత సాగు విధానాల వైపు ప్రోత్సహించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ చి. లచ్చన్న మాట్లాడుతూ PMDS వినియోగం, కషాయ ద్రావణాల తయారీ, బయో రిసోర్స్ సెంటర్ల సేవలు, ప్రకృతి వ్యవసాయం వల్ల కలిగే ఆరోగ్య, పర్యావరణ ప్రయోజనాలను వివరించారు. భూమి సారాన్ని పెంచుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి ప్రకృతి వ్యవసాయం దోహదపడుతుందని పేర్కొంటూ రైతులందరూ ఈ విధానాన్ని విస్తృతంగా స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో, APCNF సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.