✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.
పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్దపులి బీబర్సు సృష్టించింది దండంకి గంగులపాలెం గ్రామాల మధ్యలో ఉన్న పశువులపై దాడి చేసినట్లు అటు విశాఖ అధికారులు గుర్తించారు మార్గ మధ్యలో కనిపించిన ప్రతి పశువుపై పులి దాడి చేసి తన పంజా విసిరింది ఒకేసారి 13 దూడలను చంపడంతో చుట్టుపక్కల ప్రజలు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు పెద్దపులిని ఎలాగైనా పట్టుకుని తరలించాలని గిరిజనులు కోరుతున్నారు. పెద్దపులి వేటాడితే ఎలా ఉంటుందో అటవీశాఖ అధికారులు కళ్ళారా చూశారు.
పులి వేటాడను తీరు చూసి గ్రామ ప్రజల భయంతో వణికి పోతున్నారు. పులి పంజాదెబ్బకు లేగ దూడల శరీరం నుజ్జునుజులు అవుతున్నాయి. దారిలో కనిపించిన ప్రతి పశువును వేటాడి హతమార్చింది ప్రస్తుతం పులి సంచరిస్తున్న ప్రదేశానికి అటవీ శాఖలో ముఖ్య అధికారులు కింది స్థాయి అధికారులు సిబ్బంది భారీగా తరలి వెళ్లి డ్రోన్ సహాయంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చే పరికరాల, మరికొందరు నిపుణులు వెళ్లారు దండంగి సమీపంలో కొండపై పులి ఉన్నట్టు అటవిశాఖ అధికారులు చెబుతున్నారు
End



