Thursday, 10 September 2026
  • Home  
  • పోటీ చేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మాజీమంత్రి జోగి రమేష్ పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా
- ఎన్ టి ఆర్ జిల్లా

పోటీ చేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మాజీమంత్రి జోగి రమేష్ పున్నమి న్యూస్ ఎన్టీఆర్ జిల్లా

మైలవరం నియోజకవర్గం స్థానిక ఎన్నికలలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం. పోటీ చేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం – ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. ప్రజలకు జగనన్న చేసిన మంచే – మనకి శ్రీరామరక్ష. మాజీ మంత్రి జోగి రమేష్ గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ఎన్టీఆర్ జిల్లా. ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్, 9, ఇబ్రహీంపట్నంలో: రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ గడ్డపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) విజయం సాధించడం ఖాయమని పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ మంత్రి జోగి రమేష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ధీమా వ్యక్తం చేశారు. మైలవరంనియోజకవర్గ విస్తృత సమావేశం ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వెంకటేశ్వరావు కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని, ప్రజా మద్దతు పూర్తిగా తమవైపే ఉందని క్యాడర్ స్పష్టం చేస్తోంది. సంక్షేమ పథకాలే మా ధైర్యమని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన విధానమే తమను ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేలా చేస్తోందని వివరించారు. ప్రజల ముంగిటకే పాలనను తీసుకెళ్లడం వల్ల ఓటర్లు తమను నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని, అదే తమ గెలుపునకు బలమైన పునాది అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లోకి వెళ్లేందుకు కూటమి నాయకుల జంకు: మరోవైపు ప్రతిపక్ష కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని మైలవరం వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఎద్దేవా చేసింది. గతంలో వారు చేసిన తప్పులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ఓటర్లను ముఖం చూపించలేక వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులకు ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదని, వైఎస్సార్‌సీపీ జెండా మైలవరం గడ్డపై మరోసారి ఎగరడం ఖాయమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

మైలవరం నియోజకవర్గం స్థానిక ఎన్నికలలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం.

పోటీ చేసే ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం – ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు.

ప్రజలకు జగనన్న చేసిన మంచే – మనకి శ్రీరామరక్ష.

మాజీ మంత్రి జోగి రమేష్ గారు మరియు జిల్లా పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు

ఎన్టీఆర్ జిల్లా.
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్, 9,

ఇబ్రహీంపట్నంలో: రాబోయే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ గడ్డపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) విజయం సాధించడం ఖాయమని పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ మంత్రి జోగి రమేష్ గారు, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ధీమా వ్యక్తం చేశారు. మైలవరంనియోజకవర్గ విస్తృత సమావేశం ఇబ్రహీంపట్నంలోని ముత్తవరపు వెంకటేశ్వరావు కళ్యాణ మండపంలో బుధవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీకి తిరుగులేదని, ప్రజా మద్దతు పూర్తిగా తమవైపే ఉందని క్యాడర్ స్పష్టం చేస్తోంది.
సంక్షేమ పథకాలే మా ధైర్యమని,
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చేలా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేసిన విధానమే తమను ప్రజల్లోకి ధైర్యంగా వెళ్లేలా చేస్తోందని వివరించారు. ప్రజల ముంగిటకే పాలనను తీసుకెళ్లడం వల్ల ఓటర్లు తమను నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారని, అదే తమ గెలుపునకు బలమైన పునాది అని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజల్లోకి వెళ్లేందుకు కూటమి నాయకుల జంకు:
మరోవైపు ప్రతిపక్ష కూటమి నాయకులు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని మైలవరం వైఎస్సార్‌సీపీ నాయకత్వం ఎద్దేవా చేసింది. గతంలో వారు చేసిన తప్పులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్ల ఓటర్లను ముఖం చూపించలేక వెనుకడుగు వేస్తున్నారని విమర్శించారు. కూటమి నాయకులకు ప్రజాక్షేత్రంలో తిరస్కారం తప్పదని, వైఎస్సార్‌సీపీ జెండా మైలవరం గడ్డపై మరోసారి ఎగరడం ఖాయమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గస్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.