నెల్లూరు (కలెక్టరేట్),: రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబానికి ఊహించని ఆపద వచ్చిపడింది. నెల్లూరు వైఎస్సార్‌నగర్‌కు చెందిన కర్రి ఆదినారాయణ కుమార్తె తేజస్విని (14) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. నెల్లూరుతో పాటు చెన్నై, హైదరాబాద్, గుంటూరులోని పలు ఆసుపత్రుల్లో చికిత్స చేయించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని సూచించారు. వైద్య సేవలు, సీఎంఆర్‌ఎఫ్ సహాయం లభించినా అదనంగా రూ.20 నుంచి రూ.30 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు బాలిక తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా తమ కుమార్తెకు చికిత్స అందించేందుకు సహాయం చేయాలని కోరుతూ సోమవారం చుట్టుపక్కల వారితో కలిసి కలెక్టరేట్‌కు చేరుకుని అధికారులను వేడుకున్నారు.

పేద కుటుంబానికి పెద్ద ఆపద.. బాలిక వైద్యం కోసం రూ.30 లక్షలు