పుల్లంపేట మండలం అనాసముద్రం గ్రామానికి చెందిన దాసరి పల్లి మంద గంగయ్య, సుబ్బమ్మ దంపతుల కుమారుడు రాము వివాహాన్ని ఆకేపాటి ఎస్టేట్లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉచితంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, శ్రీమతి జ్యోతమ్మ దంపతులు ఆతిథ్యం ఇచ్చారు. వధూవరులకు తాళిబొట్టుతో పాటు వివాహానికి అవసరమైన ఏర్పాట్లు, బంధుమిత్రులకు అల్పాహారం ఉచితంగా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కళ్యాణ్ రెడ్డి, శంకర్, హరి బాబు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.



