Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పేట బయ్యవరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ ఘన విజయం.. 719 ఓట్ల భారీ మెజార్టీతో యల్లపు లక్ష్మి గెలుపు!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పేట బయ్యవరం ఎంపీటీసీ స్థానంలో టీడీపీ ఘన విజయం.. 719 ఓట్ల భారీ మెజార్టీతో యల్లపు లక్ష్మి గెలుపు!

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పేట బయ్యవరం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యల్లపు లక్ష్మి 719 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు.
  • ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
  • యలమంచిలి మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యడ్ల చినబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి విజయానికి బాటలు వేశారు.

అనకాపల్లి జిల్లా యలమంచిలి మండలం పేట బయ్యవరం ఎంపీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యల్లపు లక్ష్మి 719 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిసింది.
యలమంచిలి మండల టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యడ్ల చినబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేసి విజయానికి బాటలు వేశారు. ఈ సందర్భంగా యడ్ల చినబాబు మాట్లాడుతూ.. యల్లపు లక్ష్మికి భారీ విజయాన్ని అందించిన ఓటర్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానుల కృషి మరువలేనిదన్నారు.ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ విజయంతో పేట బయ్యవరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ యల్లపు లక్ష్మికి అభినందనలు తెలిపారు.

వార్తా మూలాలు

  • కె. ఆనంద్పత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *