Thursday, 10 September 2026
  • Home  
  • పెద్ద పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- కాకినాడ

పెద్ద పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

పత్రికా ప్రకటన కాకినాడ జిల్లా అటవీ శాఖ తేదీ: 10.09.2026 పెద్ద పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాజవొమ్మంగి రేంజ్ పరిధి నుండి ఒక పెద్ద పులి ది. 10.09.2026 న ఉదయం సుమారు 5:30 గంటలకు రేడియో కాలర్ ద్వారా అందిన సమాచారాన్ని బట్టి కాకినాడ జిల్లా ఏలేశ్వరం రేంజ్ పరిధిలోని ఉలిగోగుల రిజర్వ్ ఫారెస్ట్, కంపార్టుమెంట్ నెం. 574, పెద్దిపాలెం బీట్, ఏలేశ్వరం సెక్షన్ పరిధిలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో దారపల్లి, బురదకోట, మిత్తివాడ, బౌరువాక, తాడువాయి మరియు పరిసర గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది. హనుమాన్ rescue బృందాలు రంగంలోకి దిగాయి. ప్రజల భద్రత దృష్ట్యా: – ఎవ్వరూ అడవిలోకి వెళ్లరాదు. – అత్యవసర పరిస్థితి తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – ఎవరూ ఒంటరిగా సంచరించరాదు. – తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దారపల్లి వాటర్ ఫాల్స్ ప్రాంతానికి ఎవరూ వెళ్లరాదు. – పులి సంచారం గురించి ఎటువంటి సమాచారం, ఆనవాళ్లు లేదా కదలికలు కనిపించినా ప్రజలు స్వయంగా దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. – పులిని వెంబడించడం, గుంపులుగా చేరి చూడడం లేదా ఫోటోలు/వీడియోల కోసం దగ్గరకు వెళ్లడం వంటి చర్యలకు పాల్పడరాదు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, అటవీ శాఖ అధికారులు జారీ చేసే సూచనలు మరియు కాకినాడ జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ ఎన్. రామచంద్రరావు గారి ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరడమైనది. – జిల్లా అటవీ శాఖాధికారి కాకినాడ జిల్లా Uploaded Video:

పత్రికా ప్రకటన
కాకినాడ జిల్లా అటవీ శాఖ
తేదీ: 10.09.2026

పెద్ద పులి సంచారం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రాజవొమ్మంగి రేంజ్ పరిధి నుండి ఒక పెద్ద పులి ది. 10.09.2026 న ఉదయం సుమారు 5:30 గంటలకు రేడియో కాలర్ ద్వారా అందిన సమాచారాన్ని బట్టి కాకినాడ జిల్లా ఏలేశ్వరం రేంజ్ పరిధిలోని ఉలిగోగుల రిజర్వ్ ఫారెస్ట్, కంపార్టుమెంట్ నెం. 574, పెద్దిపాలెం బీట్, ఏలేశ్వరం సెక్షన్ పరిధిలోకి ప్రవేశించినట్లు అటవీ శాఖకు సమాచారం అందింది.

ఈ నేపథ్యంలో దారపల్లి, బురదకోట, మిత్తివాడ, బౌరువాక, తాడువాయి మరియు పరిసర గ్రామాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ సూచించింది. హనుమాన్ rescue బృందాలు రంగంలోకి దిగాయి.

ప్రజల భద్రత దృష్ట్యా:

– ఎవ్వరూ అడవిలోకి వెళ్లరాదు.
– అత్యవసర పరిస్థితి తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
– ఎవరూ ఒంటరిగా సంచరించరాదు.
– తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు దారపల్లి వాటర్ ఫాల్స్ ప్రాంతానికి ఎవరూ వెళ్లరాదు.
– పులి సంచారం గురించి ఎటువంటి సమాచారం, ఆనవాళ్లు లేదా కదలికలు కనిపించినా ప్రజలు స్వయంగా దాని దగ్గరకు వెళ్లకుండా వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.
– పులిని వెంబడించడం, గుంపులుగా చేరి చూడడం లేదా ఫోటోలు/వీడియోల కోసం దగ్గరకు వెళ్లడం వంటి చర్యలకు పాల్పడరాదు.

ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అటవీ శాఖ అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికాకుండా, అటవీ శాఖ అధికారులు జారీ చేసే సూచనలు మరియు కాకినాడ జిల్లా అటవీ శాఖాధికారి శ్రీ ఎన్. రామచంద్రరావు గారి ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని కోరడమైనది.

– జిల్లా అటవీ శాఖాధికారి
కాకినాడ జిల్లా

Uploaded Video:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.