Wednesday, 19 August 2026
  • Home  
  • పాలేరు బీజేపీ నేతల మర్యాదపూర్వక భేటీ
- ఖమ్మం

పాలేరు బీజేపీ నేతల మర్యాదపూర్వక భేటీ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కిసాన్ మోర్చా మాజీ అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గల్లా సత్యనారాయణలను శ్రీధర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో పాలేరు నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల అధ్యక్షులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం రూరల్ మండల అధ్యక్షులు జాటోత్ మధు నాయక్, నేలకొండపల్లి మండల అధ్యక్షులు పాగుర్తి సుధాకర్, కూసుమంచి మండల అధ్యక్షులు పుణ్యవతి, ఏదులాపురం మున్సిపల్ అధ్యక్షులు నాగరాజు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలకు సన్నద్ధత, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన పోరాటంపై నాయకులతో చర్చించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి, ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.