ఎర్పేడు, ఏప్రిల్ 22 (పున్నమి న్యూస్( ఎర్పేడు మండలం పాగాలి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 3, 4, 5 తరగతులను యథావిధిగా కొనసాగించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు సీపీఎం నాయకులతో కలిసి ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ సిబ్బందికి వినతిపత్రం అందజేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం నాయకుడు రంగయ్య మాట్లాడుతూ.. పాగాలి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను పంగూరు మోడల్ ప్రైమరీ స్కూల్‌లో విలీనం చేయడంతో రవాణా సౌకర్యాల లేమి కారణంగా సుమారు 20 మంది విద్యార్థులు పాఠశాలకు దూరమయ్యారని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో రహదారులు సరిగా లేకపోవడం, ఆటో సౌకర్యం లేకపోవడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను పంపించలేకపోతున్నారని పేర్కొన్నారు. అధికంగా గిరిజన కుటుంబాలకు చెందిన విద్యార్థులు కావడంతో రవాణా ఖర్చులు భరించలేక చదువు మధ్యలోనే మానేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి ఆ విద్యార్థులను పాగాలి పాఠశాలలోనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు వెంకటేష్, హేమాద్రి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.

పాగాలి పాఠశాలలో 3–5 తరగతుల కొనసాగింపుకు తల్లిదండ్రుల ధర్నా