జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానుపై వైసీపీ నాయకుడు ఇంటూరి చిన్న రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
జగ్గయ్యపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఇంటూరి చిన్న రాజగోపాల్ అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయనపై చట్టప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నందిగామ పీఏసీఎస్ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టె బద్రి పోలీసులను కోరారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకుండా ఉండాలని, వ్యక్తిగత దూషణలను సహించబోమని హెచ్చరించారు.
ఫిర్యాదు కార్యక్రమంలో చందర్లపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్, నాయకులు కొమ్మవరపు స్వామి, చలమాల పురుషోత్తం, జనసేన లీగల్ సెల్ ప్రతినిధి శెట్టి వెంకటేశ్వరావు, మెండే కుటుంబరావు, సూర్య వెంకీ తదితరులు పాల్గొన్నారు.

పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేతపై ఫిర్యాదు
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభానుపై వైసీపీ నాయకుడు ఇంటూరి చిన్న రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ జనసేన నాయకులు నందిగామ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశారు. నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి ఆదేశాల మేరకు ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన బహిరంగ సభలో ఇంటూరి చిన్న రాజగోపాల్ అసభ్యకర, అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఆయనపై చట్టప్రకారం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని నందిగామ పీఏసీఎస్ చైర్మన్, జనసేన నాయకుడు కొట్టె బద్రి పోలీసులను కోరారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటకుండా ఉండాలని, వ్యక్తిగత దూషణలను సహించబోమని హెచ్చరించారు. ఫిర్యాదు కార్యక్రమంలో చందర్లపాడు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వడ్డెల్లి సుధాకర్, నాయకులు కొమ్మవరపు స్వామి, చలమాల పురుషోత్తం, జనసేన లీగల్ సెల్ ప్రతినిధి శెట్టి వెంకటేశ్వరావు, మెండే కుటుంబరావు, సూర్య వెంకీ తదితరులు పాల్గొన్నారు.

