యలమంచిలి , సెప్టెంబర్ 13: పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ఏటికొప్పాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు అగ్రహారపు కుమార్ స్వామి ఆధ్వర్యంలో ఆదివారం బండి మాంబ ఆలయ ఆవరణలో ఆలయానికి విచ్చేసిన భక్తులు, గ్రామ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమార్ స్వామి ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్యావరణానికి హాని కలిగించని మట్టి విగ్రహాలను పూజించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల జల కాలుష్యం పెరిగే అవకాశం ఉన్నందున మట్టి విగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

