Wednesday, 16 September 2026
  • Home  
  • పదేళ్లలో చేయలేని పనులు.. ఆరు నెలల్లోనే చేపట్టాం: 60కి 60 డివిజన్లు గెలుస్తాం: కాంగ్రెస్
- ఖమ్మం

పదేళ్లలో చేయలేని పనులు.. ఆరు నెలల్లోనే చేపట్టాం: 60కి 60 డివిజన్లు గెలుస్తాం: కాంగ్రెస్

ఖమ్మం, సెప్టెంబర్‌ 1 (పున్నమి ప్రతినిధి): ఖమ్మం నగరంలోని మూడో టౌన్‌ ప్రాంత అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న విమర్శలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ప్రజల భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. సోమవారం మూడో టౌన్‌ ప్రకాష్‌నగర్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీ తరఫున చిన్న పిలుపు మాత్రమే ఇచ్చినప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం కాంగ్రెస్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై వాస్తవాలను వివరించేందుకు ఆర్‌జేసీ కృష్ణ విడుదల చేసిన ఆడియో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని విమర్శించారు. చెక్‌డ్యామ్‌ తొలగింపు వెనుక వాస్తవాలు ఇవే సీఎండబ్ల్యూసీ పరిధిలోని ప్రకాష్‌నగర్‌ చెక్‌డ్యామ్‌ తొలగింపు అంశంపై ప్రజలకు పూర్తి వాస్తవాలను వెల్లడించామని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఏఈ శంకర్‌ నాయక్‌ నేతృత్వంలో చేపట్టిన చర్యలకు సంబంధించి కోర్టు తీర్పు కూడా వెలువడిందని పేర్కొన్నారు. వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చెక్‌డ్యామ్‌ను తొలగించినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వరద ప్రమాదాన్ని నివారించేందుకు తీసుకున్న నిర్ణయాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. ప్రజలను వరదల్లో ముంచే పరిస్థితులు రావాలని బీఆర్‌ఎస్‌ నేతలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాలువ విస్తరణ ఎంత మేరకు చేపట్టాలనే అంశంలో ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టం చేశారు. ఆరు నెలల్లో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం గత పదేళ్లలో పూర్తికాని అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతం చేసిందని నాయకులు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మార్కెట్‌, తీగల వంతెన తదితర కీలక పనులకు తక్కువ వ్యవధిలోనే శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, మంత్రి తుమ్మలపై విమర్శలు చేసే ముందు గత పాలనలో జరిగిన పరిణామాలను పరిశీలించాలని బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు. గొల్లపాడు కాలువ సుందరీకరణ, అభివృద్ధి పనుల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రణాళికలను మార్చారని ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావు గతంలో రూపొందించిన ప్రణాళికను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చిందని, దాని వల్ల భవిష్యత్‌లో వరదల సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఏర్పడిందన్నారు. ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికల్లో మార్పులు చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని విమర్శించారు. తుమ్మల ప్రచారం కంటే పనికే ప్రాధాన్యత ఇచ్చే నాయకుడని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అండర్‌బ్రిడ్జి విషయంలో ఆయనపై అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. మూడో టౌన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం బీఆర్‌ఎస్‌ పాలనలో మూడో టౌన్‌ అనేక సమస్యలను ఎదుర్కొందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల కోరికలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతి అభివృద్ధి నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. చప్టా నిర్మాణం వల్ల వరద ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందన్న విషయాన్ని గత పాలకులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజా భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలకు తావివ్వకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు. మార్కెట్‌ యార్డు అభివృద్ధిలో తుమ్మల కృషి కీలకం ఖమ్మం మార్కెట్‌ యార్డు అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. పీఎస్‌ఆర్‌ రోడ్డు విస్తరణకు గతంలో అడ్డంకులు సృష్టించింది బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్‌ కాదా? అని ప్రశ్నించారు. తుమ్మల దూరదృష్టితో స్థానిక ప్రజలను ఒప్పించి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. గతంలో మూడో టౌన్‌లో మిర్చి వ్యాపారానికి సంబంధించిన సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం శీతల గిడ్డంగులు, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో వ్యాపారులు, రైతులు ప్రయోజనం పొందుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌ ప్రజాదరణ చూసే బీఆర్‌ఎస్‌ విమర్శలు మూడో టౌన్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలితాలే కాంగ్రెస్‌ విజయానికి పునాది అని పేర్కొంటూ, రానున్న ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల్లో 60కి 60 డివిజన్లను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు నాగండ్ల దీపక్‌ చౌదరి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బాలగంగాధర్‌ తిలక్, కాంగ్రెస్‌ నాయకులు కమర్తపు మురళి, గజ్జల వెంకన్న, కోనేటి వెంకన్న పాల్గొన్నారు.

ఖమ్మం, సెప్టెంబర్‌ 1 (పున్నమి ప్రతినిధి): ఖమ్మం నగరంలోని మూడో టౌన్‌ ప్రాంత అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న విమర్శలు రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నవని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ప్రజల భద్రత, అవసరాలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను వేగంగా చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

సోమవారం మూడో టౌన్‌ ప్రకాష్‌నగర్‌లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి పార్టీ తరఫున చిన్న పిలుపు మాత్రమే ఇచ్చినప్పటికీ భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడం కాంగ్రెస్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై వాస్తవాలను వివరించేందుకు ఆర్‌జేసీ కృష్ణ విడుదల చేసిన ఆడియో ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉందని విమర్శించారు.

చెక్‌డ్యామ్‌ తొలగింపు వెనుక వాస్తవాలు ఇవే

సీఎండబ్ల్యూసీ పరిధిలోని ప్రకాష్‌నగర్‌ చెక్‌డ్యామ్‌ తొలగింపు అంశంపై ప్రజలకు పూర్తి వాస్తవాలను వెల్లడించామని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. ఏఈ శంకర్‌ నాయక్‌ నేతృత్వంలో చేపట్టిన చర్యలకు సంబంధించి కోర్టు తీర్పు కూడా వెలువడిందని పేర్కొన్నారు. వరద ముప్పు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చెక్‌డ్యామ్‌ను తొలగించినట్లు తెలిపారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వరద ప్రమాదాన్ని నివారించేందుకు తీసుకున్న నిర్ణయాలను రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. ప్రజలను వరదల్లో ముంచే పరిస్థితులు రావాలని బీఆర్‌ఎస్‌ నేతలు కోరుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కాలువ విస్తరణ ఎంత మేరకు చేపట్టాలనే అంశంలో ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఆరు నెలల్లో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం

గత పదేళ్లలో పూర్తికాని అనేక అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతం చేసిందని నాయకులు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మార్కెట్‌, తీగల వంతెన తదితర కీలక పనులకు తక్కువ వ్యవధిలోనే శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం, మంత్రి తుమ్మలపై విమర్శలు చేసే ముందు గత పాలనలో జరిగిన పరిణామాలను పరిశీలించాలని బీఆర్‌ఎస్‌ నేతలకు సూచించారు.

గొల్లపాడు కాలువ సుందరీకరణ, అభివృద్ధి పనుల్లో గత ప్రభుత్వ హయాంలో ప్రణాళికలను మార్చారని ఆరోపించారు. తుమ్మల నాగేశ్వరరావు గతంలో రూపొందించిన ప్రణాళికను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చిందని, దాని వల్ల భవిష్యత్‌లో వరదల సమయంలో సమస్యలు తలెత్తే అవకాశం ఏర్పడిందన్నారు. ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రణాళికల్లో మార్పులు చేయడం వల్లే సమస్యలు ఉత్పన్నమయ్యాయని విమర్శించారు. తుమ్మల ప్రచారం కంటే పనికే ప్రాధాన్యత ఇచ్చే నాయకుడని, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అండర్‌బ్రిడ్జి విషయంలో ఆయనపై అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు.

మూడో టౌన్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం

బీఆర్‌ఎస్‌ పాలనలో మూడో టౌన్‌ అనేక సమస్యలను ఎదుర్కొందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ప్రస్తుతం ప్రజల కోరికలు, స్థానిక అవసరాలకు అనుగుణంగా ప్రతి అభివృద్ధి నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. చప్టా నిర్మాణం వల్ల వరద ప్రవాహంపై ప్రభావం పడే అవకాశం ఉందన్న విషయాన్ని గత పాలకులు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. ప్రజా భద్రతకు సంబంధించిన అంశాల్లో రాజకీయాలకు తావివ్వకుండా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని సూచించారు.

మార్కెట్‌ యార్డు అభివృద్ధిలో తుమ్మల కృషి కీలకం

ఖమ్మం మార్కెట్‌ యార్డు అభివృద్ధిలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక పాత్ర పోషించారని కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. పీఎస్‌ఆర్‌ రోడ్డు విస్తరణకు గతంలో అడ్డంకులు సృష్టించింది బీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్‌ కాదా? అని ప్రశ్నించారు. తుమ్మల దూరదృష్టితో స్థానిక ప్రజలను ఒప్పించి అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. గతంలో మూడో టౌన్‌లో మిర్చి వ్యాపారానికి సంబంధించిన సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, ప్రస్తుతం శీతల గిడ్డంగులు, ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రావడంతో వ్యాపారులు, రైతులు ప్రయోజనం పొందుతున్నారని అన్నారు.

కాంగ్రెస్‌ ప్రజాదరణ చూసే బీఆర్‌ఎస్‌ విమర్శలు

మూడో టౌన్‌ ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్‌ఎస్‌ నాయకులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టించకుండా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందుతున్న అభివృద్ధి, సంక్షేమ ఫలితాలే కాంగ్రెస్‌ విజయానికి పునాది అని పేర్కొంటూ, రానున్న ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల్లో 60కి 60 డివిజన్లను కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు నాగండ్ల దీపక్‌ చౌదరి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు బాలగంగాధర్‌ తిలక్, కాంగ్రెస్‌ నాయకులు కమర్తపు మురళి, గజ్జల వెంకన్న, కోనేటి వెంకన్న పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.