*పడమటి కంభంపాడు ఇసుక రిచ్ లో ఉద్రిక్తత*
*భారీగా తరలివచ్చి గ్రామస్థులు*
*యంత్రాలు..లారీలు అడ్డంగా కింద పడుకున్న వైనం*
*నిబంధనలుకు విరుద్ధంగా.. అక్రమ రవాణా జరుగుతుందంటూ ఆందోళన*
*అధికారులు మొద్దు నిద్ర పోతున్నట్టు ఆగ్రహం*
*భూగర్భజలాలు అడుగంటుతున్నాయంటూ ఆవేదన*
*త్రాగడానికి మంచినీళ్లు లేక అల్లాడుతున్నామంటూ ఆగ్రహం*
*రాత్రి..పగలు తేడా లేకుండా జోరుగా అక్రమ రవాణా*
*కన్నెర్ర చేసిన పీకే.పాడు పంచాయతీ ప్రజలు*
*పోలీసులు మొహరింపు*
*కూలీల నోరు కొడుతున్న బడా బాబులు*
*అడిగే వారు ఎవరు*
అనంతసాగరం మండలం లోని పడమటి కంభంపాడు ఇసుక రీచ్ లో శుక్రవారం పడమటి కంభంపాడు సర్పంచ్ కత్తి లావణ్య అద్వర్యం లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.ఈ సందర్భంగా సర్పంచ్ కత్తి లావణ్య మాట్లాడుతూ ఇసుక త్రావకాల ద్వారా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని తద్వారా మూడు గ్రామాలకు త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.ప్రొక్లెయిన్లతోటి విచ్చల విడిగా ఎక్కడపడితే అక్కడ లెక్కపక్క లేకుండా త్రవ్వకాలు సాగిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో కూలీల ద్వారా ఇసుక పోసేవారు.అయితే ఇప్పుడు యంత్రాలతో లోడింగ్ చేయడం తో కూలీలు ఉపాధి కోల్పోయి నానా ఇబ్బందులకు గురిఅవుతున్నారు.జిల్లా ఉన్నతాధికారులుకు ఎన్ని సార్లు పిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోక పోవడంతో ఆందోళనకు డిగామన్నారు.దీంతో లారీలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.ఉన్నతాధికారులు మాకు ఉపాది కల్పించాలని కూలీలు కోరారు.ఇసుక అక్రమ రవాణాను అధికారులు అడ్డుకోవాలని పీకే.పాడు పంచాయితీ ప్రజలు కోరారు..