యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించటం జరిగింది..
ముఖ్య అతిథిలుగా హాజరైన కొలుపుల హరినాద్ గారు,పెంట నరసింహ గారు మాట్లాడుతూ
పండుగ సాయన్న భారత స్వతంత్రోద్యమ (1900) కాలంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు, ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర అని పండుగ సాయన్న ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినవాడు అని,పేదప్రజలకు దానధర్మాలు చేసిన ప్రజా నాయకుడిగా, తెలంగాణ రాబిన్‌హుడ్ గా సుపరిచితుడు. కానీ రాబిన్‌హుడ్ లాగా పండుగ సాయన్న కేవలం ధనవంతులను కొట్టి పేదవాళ్లకు పెట్టేవాడని,సాయన్న 1840 నుంచి 1900 మధ్య కాలానికి చెందినవాడని,అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. అతను తెలంగాణలోని మహబూబ్ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోనిపల్లె గ్రామానికి చెందినవాడు అని అతను గ్రామీణ క్రీడల్లో ఆరితేరినవాడు అని,20 కేజీల గుండును అవలీలగా ఒక్కచేత్తో లేపే వాడట. ఎద్దులబండిని ఒక్క చేతితో లేపి విసిరేవాడుఅనీ,అతను పేదవర్గాలకు సహాయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా అతనిని చిత్రించారు అని,ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు ,సాయన్న సొంతంగా ఆయుధాలు తయారుచేసుకున్నాడు ,ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అని తెలిపారు…
ఈ కార్యక్రమంలో జిల్లా ఫిషరీస్ట్ ఛైర్మన్ పాశం సంజయ్ బాబు ,
ఇట్టబోయిన గోపాల్,గొర్రెంకల శివశంకర్,ఎనబోయిన జంగీర్,సాదు విజయ్,ఉడుత భాస్కర్,పిట్టల బాలరాజు,దిద్దికాడి భగత్,కమ్మ వెంకటేష్,కొలుపుల నాగరాజు,శాగంటి నర్సింహ,గుర్రాల మల్లేష్,బీసుకుంట్ల జంగిర్,బోయిని బాలయ్య,కానుక బాలరాజు,తుమ్మల నగేష్,మేడబోయిన సాయి,బూస కిష్టయ్య,సిదేన్కి కోటయ్య,కొలుపుల గణేష్,శ్రీకాంత్, బండి సూరి,బండి మహేష్,సాదు మనోజ్,పెంట నితీష్,ఇట్టబోయిన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…



1 Comment
tlovertonet
August 8, 2025It’s actually a cool and helpful piece of information. I am glad that you shared this useful information with us. Please keep us up to date like this. Thanks for sharing.
光算科技
August 8, 2025F*ckin’ awesome things here. I am very glad to see your post. Thanks a lot and i’m looking forward to contact you. Will you please drop me a mail?