పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో ఓ వ్యాపారిపై దుండగులు కాల్పులు జరపడంతో తీవ్ర కలకలం రేగింది. మఖు పట్టణంలోని ప్రధాన మార్కెట్‌లో జరిగిన ఈ ఘటనలో దుకాణ యజమాని గుర్‌చరణ్ సింగ్ గాబా మృతి చెందారు. మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. గాయపడిన వ్యాపారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఈ ఘటనతో మార్కెట్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

పంజాబ్‌లో వ్యాపారిపై కాల్పులు.. మార్కెట్‌లో కలకలం