Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పంచాయతీ ఎన్నికల భద్రతపై ఐజీ ప్రత్యేక సమీక్ష..!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పంచాయతీ ఎన్నికల భద్రతపై ఐజీ ప్రత్యేక సమీక్ష..!

వార్త ముఖ్యాంశాలు

  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి: విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి యలమంచిలి: విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం యలమంచిలి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు.
  • ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయ రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు.
  • అనంతరం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టాలి: విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి

యలమంచిలి: విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ జట్టి, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం యలమంచిలి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి వార్షిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కార్యాలయ రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును సమీక్షించారు. అనంతరం పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. రానున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఐజీ ఆదేశించారు. ముఖ్యంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ముందుగానే గుర్తించి, అక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ సమస్యల నియంత్రణపై దృష్టి సారించాలని, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పరవాడ డీఎస్పీ బి. మోహనరావు, సీఐ ధనుంజయరావు, ఎస్సైలు ఉపేంద్ర, సావిత్రి, రామకృష్ణ, ప్రసాద్ తదితర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingపత్రిక / వెబ్‌సైట్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *