Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

యలమంచిలి మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ!

Punnami Newsroom Published:
యలమంచిలి మండలంలో పంచాయతీ ఎన్నికల సందడి.. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ!

Story highlights

  • 8 కేంద్రాల్లో నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి..
  • అభ్యర్థులకు అధికారుల సూచన యలమంచిలి మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
  • ఈ మేరకు సోమవారం అధికారిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

8 కేంద్రాల్లో నామినేషన్లకు ఏర్పాట్లు పూర్తి.. అభ్యర్థులకు అధికారుల సూచన

యలమంచిలి మండల పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు సోమవారం అధికారిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. మండల ఎన్నికల అధికారి, ఇన్‌ఛార్జ్ ఎంపీడీఓ వి. దీపిక, ఇన్‌ఛార్జ్ పంచాయతీ విస్తరణ అధికారి గిరిప్రసాద్ తదితరులు నోటిఫికేషన్‌ను ప్రచురించారు.ఈ సందర్భంగా ఎంపీడీఓ వి. దీపిక మాట్లాడుతూ నవంబర్ 18వ తేదీ బుధవారం నుంచి మండలంలోని ఎనిమిది కేంద్రాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఏటికొప్పాక, బయ్యవరం, పులపర్తి, కృష్ణాపురం, పోతిరెడ్డిపాలెం, పురుషోత్తపురం, లైన్ కొత్తూరు, శేఖాలిపాలెం గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆయా కేంద్రాల్లో నియమించిన స్టేజ్-1 ఎన్నికల అధికారుల సమక్షంలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనల ప్రకారం అవసరమైన పత్రాలతో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.

News Sources

  • కె. ఆనంద్Publication / website

Leave a comment

Your email address will not be published. Required fields are marked *