Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

Punnami Newsroom Published:
యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ పత్రికా దినోత్సవం

Story highlights

  • జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా జర్నలిస్టుల సమావేశంతో పాటు గీతాంజలి, వాగ్దేవి కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.
  • సోమేశ్వరరావు, రిటైర్డ్ అధ్యాపకులు ఆడారి పూరి జగన్నాథం, ప్రముఖ న్యాయవాది కూనిశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు.

జర్నలిస్టుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని యలమంచిలి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వాగ్దేవి కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమావేశంతో పాటు గీతాంజలి, వాగ్దేవి కళాశాల విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్. సోమేశ్వరరావు, రిటైర్డ్ అధ్యాపకులు ఆడారి పూరి జగన్నాథం, ప్రముఖ న్యాయవాది కూనిశెట్టి శ్రీనివాసరావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వారి భద్రత, వృత్తి గౌరవం, సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గొల్లవిల్లి చిన్నాజి, కార్యదర్శి ధర్మిరెడ్డి అప్పలనాయుడు, సింహాచలం, అప్పికొండ గణేష్, నానేపల్లి సన్యాసిరావు, కిషోర్, గుమ్మెళ్ల గోవిందరావు, టీవీఎస్ ప్రకాష్, గిన్నె ఆదిరెడ్డి, ఆర్.ఎస్. నాయుడు, పల్లా రాజబాబు, కే. ఆనంద్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

News Sources

  • కె. ఆనంద్Publication / website

Leave a comment

Your email address will not be published. Required fields are marked *